whose
ద్వితీయోపదేశకాండమ 1:28

మనమెక్కడికి వెళ్లగలము? మన సహోదరులు అక్కడి జనులు మనకంటె బలిష్ఠులును ఎత్తరులునై యున్నారు; ఆ పట్టణములు గొప్పవై ఆకాశమునంటు ప్రాకారములతో నున్నవి; అక్కడ అనాకీయులను చూచితిమని చెప్పి మా హృదయములను కరగజేసిరని మీరు చెప్పితిరి.

ద్వితీయోపదేశకాండమ 9:1

ఇశ్రాయేలూ వినుము; నీకంటె గొప్ప బలముగల జనములను ఆకాశమంటు ప్రాకారములు గల గొప్ప పట్టణములను స్వాధీనపరచుకొనుటకై నేడు నీవు యొర్దానును దాటబోవుచున్నావు.

దానియేలు 4:11

ఆ చెట్టు వృద్ధి పొంది బ్రహ్మాండమైనదాయెను ; దాని పైకొమ్మలు ఆకాశము నకంటునంత ఎత్తుగాను దాని ఆకారము భూ తలమంత విశాలముగాను ఉండెను.

దానియేలు 4:22

రాజా , ఆ చెట్టు నిన్ను సూచించుచున్నది; నీవు వృద్ధిపొంది మహా బలముగలవాడవైతివి ; నీ ప్రభావము వృద్ధినొంది ఆకాశమంత ఎత్తాయెను ; నీ ప్రభుత్వము లోకమంతట వ్యాపించియున్నది.

వారుమనము
2 సమూయేలు 8:13

దావీదు ఉప్పు లోయలో సిరియనులగు పదునెనిమిది వేలమందిని హతము చేసి తిరిగి రాగా అతని పేరు ప్రసిద్ధమాయెను.

కీర్తనల గ్రంథము 49:11-13
11
వారు తమ ఆస్తిని ఇతరులకు విడిచిపెట్టుదురు తమ యిండ్లు నిరంతరము నిలుచుననియు తమ నివాసములు తరతరములకు ఉండుననియు వారను కొందురు తమ భూములకు తమ పేళ్లు పెట్టుదురు.
12
ఘనతవహించినవాడైనను మనుష్యుడు నిలువజాలడు వాడు నశించుమృగములను పోలినవాడు.
13
స్వాతిశయ పూర్ణులకును వారి నోటిమాటనుబట్టి వారి ననుసరించువారికిని ఇదే గతి.
సామెతలు 10:7

నీతిమంతుని జ్ఞాపకముచేసికొనుట ఆశీర్వాదకరమగును భక్తిహీనుల పేరు అసహ్యత పుట్టించును

దానియేలు 4:30

రాజు -బబులోనను ఈ మహా విశాలపట్టణము నా బలా ధికారమును నా ప్రభావ ఘనతను కనపరచుటకై నా రాజధాని నగరముగా నేను కట్టించినది కాదా అని తనలో తాననుకొనెను .

యోహాను 5:44

అద్వితీయ దేవునివలన వచ్చు మెప్పునుకోరక యొకనివలన ఒకడు మెప్పుపొందుచున్న మీరు ఏలాగు నమ్మగలరు? నేను తండ్రియొద్ద మీమీద నేరము మోపుదునని తలంచకుడి;

మరియు
ఆదికాండము 11:8

ఆలాగు యెహోవా అక్కడ నుండి భూమియందంతట వారిని చెదరగొట్టెను గనుక వారు ఆ పట్టణమును కట్టుట మానిరి.

ఆదికాండము 11:9

దానికి బాబెలు అను పేరు పెట్టిరి; ఎందుకనగా అక్కడ యెహోవా భూజనులందరి భాషను తారుమారుచేసెను. అక్కడ నుండి యెహోవా భూమియందంతట వారిని చెదరగొట్టెను.

కీర్తనల గ్రంథము 92:9
నీ శత్రువులు యెహోవా, నీ శత్రువులు నశించెదరు చెడుపనులు చేయువారందరు చెదరిపోవుదురు.
లూకా 1:51

ఆయన తన బాహువు తో పరాక్రమము చూపెను వారి హృదయముల ఆలోచన విషయమై గర్విష్ఠులను చెదరగొట్టెను .