the Lord forbid
1 సమూయేలు 26:9-11
9

దావీదు -నీవతని చంప కూడదు, యెహోవాచేత అభిషేకము నొందినవానిని చంపి నిర్దోషియగుట యెవనికి సాధ్యము?

10

యహోవా జీవముతోడు యెహోవాయే అతని మొత్తును, అతడు అపాయమువలన చచ్చును, లేదా యుద్ధమునకు పోయి నశించును;

11

యెహోవాచేత అభిషేకము నొందిన వానిని నేను చంపను; ఆలాగున నేను చేయకుండ యెహోవా నన్ను ఆపునుగాక. అయితే అతని తలగడ దగ్గరనున్న యీటెను నీళ్ల బుడ్డిని తీసికొని మనము వెళ్లిపోదము రమ్మని అబీషైతో చెప్పి

2 సమూయేలు 1:14

అందుకు దావీదు భయపడక యెహోవా అభిషేకించిన వానిని చంపుటకు నీవేల అతని మీద చెయ్యి ఎత్తితివి?

1 రాజులు 21:3

అందుకు నాబోతు నా పిత్రార్జితమును నీకిచ్చుటకు నాకు ఎంతమాత్రమును వల్లపడదని చెప్పగా

యోబు గ్రంథము 31:29

నన్ను ద్వేషించినవానికి కలిగిన నాశనమునుబట్టి నేను సంతోషించినయెడలను అతనికి కీడు కలుగుట చూచి నేను ఉల్లసించిన యెడలను

యోబు గ్రంథము 31:30

నేనాలాగు చేయలేదు, అతని ప్రాణమును నేను శపించలేదు పాపముచేయుటకు నా నోటికి నేను చోటియ్యనే లేదు.

మత్తయి 5:44

నేను మీతో చెప్పునదేమనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై యుండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి. మిమ్మును హింసించు వారికొరకు ప్రార్థన చేయుడి.

రోమీయులకు 12:14-21
14

మిమ్మును హింసించువారిని దీవించుడి; దీవించుడి గాని శపింప వద్దు.

15

సంతోషించు వారితో సంతోషించుడి;

16

ఏడ్చు వారితో ఏడువుడి; ఒకనితో నొకడు మనస్సుకలిసి యుండుడి. హెచ్చు వాటియందు మనస్సుంచక తగ్గువాటియందు ఆసక్తులై యుండుడి. మీకు మీరే బుద్ధిమంతులమని అనుకొనవద్దు.

17

కీడుకు ప్రతి కీడె వనికిని చేయవద్దు; మనుష్యు లందరి దృష్టికి యోగ్యమైనవాటినిగూర్చి ఆలోచన కలిగి యుండుడి.

18

శక్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుష్యుల తో సమాధానముగా ఉండుడి.

19

ప్రియులారా, మీకు మీరే పగతీర్చు కొనక, దేవుని ఉగ్రతకు చోటియ్యుడి -పగతీర్చుట నా పని, నేనే ప్రతిఫలము నిత్తును అని ప్రభువు చెప్పుచున్నాడని వ్రాయబడి యున్నది.

20

కాబట్టి, నీ శత్రువు ఆకలి గొనియుంటే అతనికి భోజనము పెట్టుము, దప్పి గొనియుంటే దాహమిమ్ము; ఆలాగు చేయుట వలన అతని తల మీద నిప్పులు కుప్పగా పోయుదువు.

21

కీడు వలన జయింప బడక, మేలు చేత కీడును జయించుము.

రోమీయులకు 13:1

ప్రతి వాడును పై అధికారులకు లోబడియుండవలెను; ఏలయనగా దేవుని వలన కలిగినది తప్ప మరి ఏ అధికారమును లేదు; ఉన్న అధికారములు దేవుని వలననే నియమింపబడి యున్నవి.

రోమీయులకు 13:2

కాబట్టి అధికారమును ఎదిరించువాడు దేవుని నియమమును ఎదిరించుచున్నాడు; ఎదిరించువారు తమమీదికి తామే శిక్ష తెచ్చుకొందురు.

1 థెస్సలొనీకయులకు 5:15

ఎవడును కీడునకు ప్రతికీడు ఎవనికైనను చేయకుండ చూచుకొనుడి;మీరు ఒకని యెడల ఒకడును మనుష్యులందరి యెడలను ఎల్లప్పుడు మేలైనదానిని అనుసరించి నడుచుకొనుడి.