
అతడు కదొర్లాయోమెరును అతనితో కూడనున్న రాజులను ఓడించి తిరిగి వచ్చినప్పుడు సొదొమ రాజు అతనిని ఎదుర్కొనుటకు, రాజులోయ అను షావే లోయ మట్టుకు బయలుదేరి వచ్చెను.
అతడు కన్నులెత్తి చూచినప్పుడు ముగ్గురు మనుష్యులు అతని యెదుట నిలువబడియుండిరి. అతడు వారిని చూచి గుడారపు వాకిటనుండి వారిని ఎదుర్కొనుటకు పరుగెత్తి, నేలమట్టుకు వంగి
యోసేపు తన రథమును సిద్ధము చేయించి తన తండ్రియైన ఇశ్రాయేలును ఎదుర్కొనుటకు గోషెనుకు వెళ్లి అతనికి కనబడెను. అప్పుడతడు అతని మెడమీద పడి అతని మెడ పట్టుకొని యెంతో ఏడ్చెను.
మోషే తన మామను ఎదుర్కొనపోయి వందనము చేసి అతని ముద్దుపెట్టుకొనెను. వారు ఒకరి క్షేమము ఒకరు తెలిసికొని గుడారములోనికి వచ్చిరి.
అతడు దహనబలి అర్పించి చాలించిన వెంటనే సమూయేలు వచ్చెను . సౌలు అతనిని కలిసికొని అతనికి వందనము చేయుటకై బయలుదేరగా
అక్కడనుండి సహోదరులు మా సంగతి విని అప్పీయా సంతపేట వరకును త్రిసత్రములవరకును మమ్మును ఎదుర్కొనుటకు వచ్చిరి. పౌలు వారిని చూచి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ధైర్యము తెచ్చుకొనెను
అక్కడనుండి వారు సాగి అమోరీయుల పొలిమేరలనుండి వచ్చి ప్రవహించి అరణ్యమందు సంచరించు అర్నోను అద్దరిని దిగిరి. అర్నోను మోయాబీయులకును అమోరీయులకును మధ్యనుండు మోయాబు సరిహద్దు.
కాబట్టి–యెహోవా సుడిగాలిచేతనైనట్టు వాహేబును అర్నోనులో పడు ఏరులను ఆరు దేశ నివాసస్థలమునకు తిరిగి మోయాబు ప్రాంతములకు సమీపముగా
మీరు లేచి సాగి అర్నోను ఏరుదాటుడి; ఇదిగో అమోరీయుడైన హెష్బోను రాజగు సీహోనును అతని దేశమును నీ చేతికి అప్పగించితిని. దాని స్వాధీనపరచుకొన మొదలుపెట్టి అతనితో యుద్ధము చేయుడి.
ఆ కాలమున అర్నోను ఏరు మొదలుకొని హెర్మోను కొండవరకు యొర్దాను అవతలనున్న దేశమును అమోరీయుల యిద్దరు రాజులయొద్దనుండి పట్టుకొంటిమి.
తరువాత వారు అరణ్యప్రయాణముచేయుచు ఎదోమీయులయొక్కయు మోయాబీయులయొక్కయు దేశముల చుట్టు తిరిగి, మోయాబునకు తూర్పు దిక్కున కనాను దేశమందు ప్రవేశించి అర్నోను అద్దరిని దిగిరి. వారు మోయాబు సరిహద్దు లోపలికి పోలేదు. అర్నోను మోయాబునకు సరిహద్దు గదా.
గూటినుండి చెదరి ఇటు అటు ఎగురు పక్షులవలె అర్నోను రేవులయొద్ద మోయాబు కుమార్తెలు కనబడుదురు.
మోయాబు పడగొట్టబడినదై అవమానము నొందియున్నది గోలయెత్తి కేకలువేయుము మోయాబు అపజయము నొందెను. అర్నోనులో ఈ సంగతి తెలియజెప్పుడి