
మేలుకొరకు నీ సేవకునికి పూటపడుము గర్విష్ఠులు నన్ను బాధింపకయుందురు గాక.
దేవా, నన్ను కరుణింపుము మనుష్యులు నన్ను మింగవలెననియున్నారు దినమెల్ల వారు పోరాడుచు నన్ను బాధించుచున్నారు.
అనేకులు గర్వించి నాతో పోరాడుచున్నారు దినమెల్ల నాకొరకు పొంచియున్నవారు నన్ను మింగవలెననియున్నారు
నేను నీకు మ్రొక్కుకొనియున్నాను నేను నీకు స్తుతియాగములనర్పించెదను.
ఆయన తన ప్రజలను సంతోషముతోను తాను ఏర్పరచుకొనినవారిని ఉత్సాహధ్వనితోను వెలుపలికి రప్పించెను.
వారు తన కట్టడలను గైకొనునట్లును
తన ధర్మశాస్త్రవిధులను ఆచరించునట్లును అన్యజనుల భూములను ఆయన వారికప్పగించెను జనముల కష్టార్జితమును వారు స్వాధీనపరచుకొనిరి.యెహోవాను స్తుతించుడి.
కాగా నీవు ఈ మాట ప్రకటింపుము ప్రభువైన యెహోవా సెలవిచ్చునదేమనగా ఆ యా జనముల మధ్యనుండి నేను మిమ్మును సమకూర్చి, మీరు చెదరగొట్టబడిన దేశములలో నుండి మిమ్మును రప్పించి, ఇశ్రాయేలు దేశమును మీ వశము చేసెదను.
వారు అక్కడికి వచ్చి అక్కడ తాముంచియున్న విగ్రహములను తీసివేసి, తాము చేసియున్న హేయక్రియలు చేయుట మానుదురు.
వారు నా కట్టడలను నా విధులను అనుసరించి గైకొనునట్లు నేను వారి శరీరములలో నుండి రాతి గుండెను తీసివేసి వారికి మాంసపు గుండెను ఇచ్చి, వారికి ఏక మనస్సు కలుగజేసి వారియందు నూతన ఆత్మ పుట్టింతును.
అప్పుడు వారు నాకు జనులై యుందురు నేను వారికి దేవుడనై యుందును.
నేను అన్యజనుల లోనుండి మిమ్మును తోడుకొని, ఆ యా దేశములలో నుండి సమకూర్చి, మీ స్వదేశము లోనికి మిమ్మును రప్పించెదను.
మీ అపవిత్రత యావత్తు పోవునట్లు నేను మీ మీద శుద్ధ జలము చల్లుదును, మీ విగ్రహములవలన మీకు కలిగిన అపవిత్రత అంతయు తీసివేసెదను.
నూతన హృదయము మీ కిచ్చెదను, నూతన స్వభావము మీకు కలుగజేసెదను, రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకిచ్చెదను.
నా ఆత్మను మీ యందుంచి, నా కట్టడల ననుసరించువారినిగాను నా విధులను గైకొను వారినిగాను మిమ్మును చేసెదను.
అబ్రాహాముతో తాను చేసిన ప్రమాణమును జ్ఞాపకము చేసికొనుటకును
మనము శత్రువుల చేతి నుండి విడిపింపబడి, మన జీవిత కాల మంతయు నిర్భయులమై, ఆయన సన్నిధిని
కావున యూదయ గలిలయ సమరయ దేశములందంతట సంఘము క్షేమాభివృద్ధినొందుచు సమాధానము కలిగియుండెను; మరియు ప్రభువునందు భయమును పరిశుద్ధాత్మ ఆదరణయు కలిగి నడుచుకొనుచు విస్తరించుచుండెను.