
అప్పుడు సమూయేలు -జనులందరిలో యెహోవా ఏర్పరచి నవానిని మీరు చూచితిరా? జను లందరిలో అతనివంటివాడొకడును లేడని చెప్పగా, జను లందరు బొబ్బలు పెట్టుచు-రాజు చిరంజీవి యగుగాక అని కేకలువేసిరి.
ఏలయనగా ఈ దినమున అతడు పోయి విస్తారమైన యెడ్లను క్రొవ్విన దూడలను గొఱ్ఱలను బలిగా అర్పించి రాజకుమారులనందరిని సైన్యాధిపతులను యాజకుడైన అబ్యాతారును పిలిపింపగా వారు వాని సముఖములో అన్నపానములు పుచ్చుకొనుచు రాజైన అదోనీయా చిరంజీవియగునుగాక అని పలుకుచున్నారు.
యాజకుడైన సాదోకును ప్రవక్తయైన నాతానును అక్కడ ఇశ్రాయేలీయులమీద రాజుగా అతనికి పట్టాభిషేకము చేసిన తరువాత మీరు బాకానాదము చేసి రాజైన సొలొమోను చిరంజీవియగునుగాక అని ప్రకటన చేయవలెను.
అప్పుడు యాజకుడు రాజకుమారుని బయటకు తోడుకొనిపోయి అతని తలమీద కిరీటము పెట్టి, ధర్మశాస్త్రగ్రంథమును అతని చేతికిచ్చిన తరువాత వారు అతని పట్టాభిషిక్తునిగా చేసి చప్పట్లుకొట్టి—రాజు చిరంజీవియగునుగాకని చాటించిరి.
కల్దీయులు సిరియాబాషతో ఇట్లనిరి -రాజు చిరకాలము జీవించునుగాక. తమరి దాసులకు కల సెలవియ్యుడి; మేము దాని భావమును తెలియజేసెదము.
రాజునకును అతని యధిపతులకును జరిగిన సంగతి రాణి తెలిసికొని విందు గృహమునకు వచ్చి ఇట్లనెను -రాజు చిరకాలము జీవించునుగాక, నీ తలంపులు నిన్ను కలవరపరచ నియ్యకుము, నీ మనస్సు నిబ్బరముగా ఉండనిమ్ము.
కాబట్టి ఆ ప్రధానులును అధిపతులును రాజు నొద్దకు సందడిగా కూడి వచ్చి ఇట్లనిరి -రాజగు దర్యావేషూ, చిరం జీవివై యుందువుగాక.
అందుకు దానియేలు రాజు చిరకాలము జీవించునుగాక.
జనసమూహములలో ఆయనకు ముందు వెళ్లుచుండినవారును వెనుక వచ్చుచుండిన వారును–దావీదు కుమారునికి జయము ప్రభువు పేరట వచ్చువాడు స్తుతింపబడునుగాక సర్వోన్నతమైన స్థలములలో జయము అని కేకలు వేయుచుండిరి.