ఫిలిష్తీయుల సర్దారు లందరిని పిలువ నంపించి -ఇశ్రాయేలీయుల దేవుని మందసమును మనము ఏమి చేయుదుమని అడిగిరి . అందుకు వారు-ఇశ్రాయేలీయుల దేవుని మందసమును ఇక్కడనుండి గాతు పట్టణమునకు పంపుడని చెప్పగా , జనులు ఇశ్రాయేలీయుల దేవుని మందసమును అక్కడనుండి గాతునకు మోసికొని పోయిరి.
అయితే వారు అష్డోదునుండి గాతునకు దానిని మోసికొనిపోయిన తరువాత యెహోవా హస్తము ఆ పట్టణపు పెద్దలకు పిన్నలకు రహస్య స్థానములలో గడ్డలు లేపి వారిని మొత్తి , గొప్ప నాశనము జేసెను .
వారు దేవుని మందసమును ఎక్రోనునకు పంపివేయగా దేవుని మందసము ఎక్రోను లోనికి వచ్చినప్పుడు ఎక్రోనీయులు కేకలు వేసి-మనలను మన జనులను చంపివేయవలెనని వీరు ఇశ్రాయేలీయుల దేవుని మందసమును మన యొద్దకు తీసికొని వచ్చిరనిరి.
కాగా జనులు ఫిలిష్తీయుల సర్దారు లనందరి పిలువనంపించి -ఇశ్రాయేలీయుల దేవుని మందసము మనలను మన జనులను చంప కుండునట్లు స్వస్థానమునకు దానిని పంపించు డనిరి . దేవుని హస్తము అక్కడ బహు భారముగా ఉండెను గనుక మరణ భయము ఆ పట్టణస్థు లందరిని పట్టి యుండెను .
చా వక మిగిలియున్నవారు గడ్డల రోగము చేత మొత్తబడిరి . ఆ పట్టణస్థుల కేకలు ఆకాశమువరకు వినబడెను.
అయితే ఇశ్రాయేలీయులు మోషేతో ఇట్లనిరి ఇదిగో మా ప్రాణములు పోయినవి; నశించిపోతివిు మేమందరము నశించిపోతివిు.
యెహోవా మందిరమునకు సమీపించు ప్రతివాడును చచ్చును; మేము అందరము చావవలసియున్నదా? అని పలికిరి.
యెహోవా కోపము ఉజ్జా మీద రగులుకొనెను. అతడు చేసిన తప్పునుబట్టి దేవుడు ఆ క్షణమందే అతని మొత్తగా అతడు అక్కడనే దేవుని మందసమునొద్ద పడి చనిపోయెను.
నేటికిని దానికి అదేపేరు. ఆ దినమున యెహోవా మందసము నాయొద్ద ఏలాగుండుననుకొని, దావీదు యెహోవాకు భయపడి
యెహోవా ఉజ్జాను వినాశము చేయుట చూచి దావీదు వ్యాకుల పడెను; అందుచేత ఆ స్థలమునకు నేటివరకు పెరెజ్‌ఉజ్జా అని పేరు.
ఆ దినమున దావీదు దేవుని విషయమై భయమొంది దేవుని మందసమును నాయొద్దకు నేను ఏలాగు తీసికొని పోవుదుననుకొని, మందసమును
తన యొద్దకు దావీదు పురమునకు తీసికొనిపోక, దానిని గిత్తీయుడైన ఓబేదెదోము ఇంటిలోనికి కొనిపోయెను.
నీవు, నీవే భయంకరుడవు నీవు కోపపడు వేళ నీ సన్నిధిని నిలువగలవాడెవడు?
అయితే ఆయన వచ్చు దినమును ఎవరు సహింపగలరు ? ఆయన అగుపడగా ఎవరు ఓర్వగలరు ? ఆయన కంసాలి అగ్నివంటివాడు , చాకలివాని సబ్బువంటివాడు ;
సీమోను పేతురు అది చూచి, యేసు మోకాళ్లయెదుట సాగిలపడి ప్రభువా, నన్నువిడిచి పొమ్ము, నేను పాపాత్ముడనని చెప్పెను.
గెరసీనీయుల ప్రాంతములలోనుండు జను లందరు బహు భయాక్రాంతులైరి గనుక తమ్మును విడిచిపొమ్మని ఆయనను వేడుకొనిరి . ఆయన దోనె యెక్కి తిరిగి వెళ్లుచుండగా , దయ్యములు వదలిపోయిన మనుష్యుడు , ఆయన తో కూడ తన్ను ఉండనిమ్మని ఆయనను వేడుకొనెను .