we hurt
1 సమూయేలు 25:15

అయితే ఆ మనుష్యులు మాకెంతో ఉపకారము చేసియున్నారు మేము పొలములో వారి మధ్యను సంచరించుచు న్నంత సేపు అపాయము గాని నష్టముగాని మాకు సంభవింపనేలేదు .

1 సమూయేలు 25:16

మేము గొఱ్ఱలను కాయు చున్నంత సేపు వారు రాత్రిం బగళ్లు మాచుట్టు ప్రాకారముగా ఉండిరి .

1 సమూయేలు 25:21
అంతకుమునుపు దావీదు -నాబాలునకు కలిగిన దాని అంతటిలో ఏదియు పోకుండ ఈ అరణ్యములో అతని ఆస్తి అంతయు నేను వ్యర్థముగా కాయుచు వచ్చితిని; ఉపకారమునకు నాకు అపకారము చేసియున్నాడే
1 సమూయేలు 22:2

మరియు ఇబ్బందిగల వారందరును , అప్పులు చేసికొనిన వారందరును , అసమాధానముగా నుండు వారందరును , అతనియొద్ద కూడుకొనగా అతడు వారికి అధిపతి యాయెను . అతనియొద్దకు ఎక్కువ తక్కువ నాలుగు వందల మంది వచ్చియుండిరి .

యెషయా 11:6-9
6

తోడేలు గొఱ్ఱపిల్లయొద్ద వాసముచేయును చిఱుతపులి మేకపిల్లయొద్ద పండుకొనును దూడయు కొదమసింహమును పెంచబడిన కోడెయు కూడుకొనగా బాలుడు వాటిని తోలును.

7

ఆవులు ఎలుగులు కూడి మేయును వాటి పిల్లలు ఒక్క చోటనే పండుకొనును ఎద్దు మేయునట్లు సింహము గడ్డి మేయును.

8

పాలుకుడుచుపిల్ల నాగుపాము పుట్టయొద్ద ఆట్లాడును మిడినాగు పుట్టమీద పాలువిడిచిన పిల్ల తన చెయ్యి చాచును

9

నా పరిశుద్ధ పర్వతమందంతటను ఏ మృగమును హానిచేయదు నాశముచేయదు సముద్రము జలముతో నిండియున్నట్టు లోకము యెహోవానుగూర్చిన జ్ఞానముతో నిండియుండును.

లూకా 3:14

సైనికులును మేమేమి చేయవలెనని అతని నడిగిరి. అందుకు అతడు ఎవనిని బాధపెట్టకయు, ఎవని మీదను అపనింద వేయకయు, మీ జీతములతో తృప్తిపొందియుండుడని వారితో చెప్పెను.

ఫిలిప్పీయులకు 2:15

సణుగులును సంశయములును మాని, సమస్త కార్యములను చేయుడి.

ఫిలిప్పీయులకు 4:8

మెట్టుకు సహోదరులారా , యే యోగ్యతయైనను మెప్పైనను ఉండినయెడల, ఏవి సత్యమైనవో , ఏవి మాన్య మైనవో , ఏవి న్యాయమైనవో , ఏవి పవిత్రమైనవో , ఏవి రమ్యమైనవో , ఏవి ఖ్యాతిగలవో , వాటిమీద ధ్యానముంచుకొనుడి .