తీర్పు తీర్చునుగాక
1 సమూయేలు 24:12

నీకును నాకును మధ్య యెహోవా న్యాయము తీర్చును. యెహోవా నా విషయమై పగతీర్చునుగాని నేను నిన్ను చంపను .

2 దినవృత్తాంతములు 24:22

ఈ ప్రకారము రాజైన యోవాషు జెకర్యా తండ్రియైన యెహోయాదా తనకు చేసిన ఉపకారమును మరచినవాడై అతని కుమారుని చంపించెను; అతడు చనిపోవునప్పుడు యెహోవా దీని దృష్టించి దీనిని విచారణలోనికి తెచ్చునుగాక యనెను.

మీకా 1:2

సకల జనులారా , ఆలకించుడి , భూమీ , నీవును నీలోనున్న సమస్తమును చెవి యొగ్గి వినుడి; ప్రభువగు యెహోవా మీమీద సాక్ష్యము పలుకబోవుచున్నాడు , పరిశుద్దా లయములోనుండి ప్రభువు మీమీద సాక్ష్యము పలుకబోవుచున్నాడు.

వ్యాజ్యెమాడి
కీర్తనల గ్రంథము 35:1

యెహోవా, నాతో వ్యాజ్యెమాడు వారితో వ్యాజ్యెమాడుము నాతో పోరాడువారితో పోరాడుము.

కీర్తనల గ్రంథము 43:1

దేవా, నాకు న్యాయము తీర్చుము భక్తిలేని జనముతో నా పక్షమున వ్యాజ్యెమాడుము కపటము కలిగి దౌర్జన్యము చేయువారి చేతిలోనుండి నీవు నన్ను విడిపించుదువు.

కీర్తనల గ్రంథము 119:154

నా పక్షమున వ్యాజ్యెమాడి నన్ను విమోచింపుము నీవిచ్చిన మాటచొప్పున నన్ను బ్రదికింపుము.

మీకా 7:9

నేను యెహోవా దృష్టికి పాపము చేసితిని గనుక ఆయన నా పక్షమున వ్యాజ్యె మాడి నా పక్షమున న్యాయము తీర్చు వరకు నేను ఆయన కోపాగ్నిని సహింతును ; ఆయన నన్ను వెలుగులోనికి రప్పించును , ఆయన నీతిని నేను చూచెదను .

deliver
1 సమూయేలు 26:4

వేగులవారిని పంపి నిశ్చయముగా సౌలు వచ్చెనని తెలిసికొనెను .