నా కుమారుడైన యోనాతాను వలన కలిగినను వాడు తప్పక మరణమవునని ఇశ్రాయేలీ యులను రక్షించు యెహోవా జీవముతోడని నేను ప్రమా ణము చేయుచున్నాననెను. అయితే జనులందరిలో అతనికి ప్రత్యుత్తరమిచ్చిన వాడు ఒకడును లేకపోయెను.
1 సమూయేలు 14:24

నేను నా శత్రువులమీద పగ తీర్చుకొనక మునుపు, సాయంత్రము కాకమునుపు భోజనము చేయువాడు శపింపబడును అని సౌలు జనులచేత ప్రమాణము చేయించెను, అందువలన జనులు ఏమియు తినకుండిరి .

1 సమూయేలు 14:44

అందుకు సౌలు -యోనాతానా , నీవు అవశ్యముగా మరణమవుదువు , నేను ఒప్పుకొనని యెడల దేవుడు నాకు గొప్ప అపాయము కలుగజేయునుగాక అనెను .

1 సమూయేలు 19:6

సౌలు యోనాతాను చెప్పిన మాట ఆలకించి -యెహోవా జీవముతోడు అతనికి మరణశిక్ష విధింపనని ప్రమాణముచేసెను .

1 సమూయేలు 20:31

యెష్షయి కుమారుడు భూమి మీద బ్రదుకు నంత కాలము నీకైనను నీ రాజ్యమునకైనను స్థిరత కలుగదు గదా; కాబట్టి నీవు వర్తమానము పంపి అతనిని నా దగ్గరకు రప్పించుము , నిజముగా అతడు మరణమున కర్హుడని చెప్పెను.

1 సమూయేలు 22:16

రాజు అహీమెలెకూ , నీకును నీ తండ్రి ఇంటివారి కందరికిని మరణము నిశ్చయము అని చెప్పి

1 సమూయేలు 28:10

అందుకు సౌలు -యెహోవా జీవముతోడు దీనినిబట్టి నీకు శిక్ష యెంతమాత్రమును రాదని యెహోవా నామమున ప్రమాణముచేయగా

2 సమూయేలు 12:5

దావీదు ఈ మాట విని ఆ మనుష్యునిమీద బహుగా కోపించుకొని యెహోవా జీవముతోడు నిశ్చయముగా ఈ కార్యము చేసినవాడు మరణపాత్రుడు.

ప్రసంగి 9:2

సంభవించునవి అన్నియు అందరికిని ఏకరీతిగానే సంభవించును; నీతిమంతులకును దుష్టులకును, మంచివారికిని పవిత్రులకును అపవిత్రులకును బలులర్పించువారికిని బలులనర్పింపని వారికిని గతియొక్కటే; మంచివారికేలాగుననో పాపాత్ములకును ఆలాగుననే తటస్థించును; ఒట్టుపెట్టుకొను వారికేలాగుననో ఒట్టుకు భయపడువారికిని ఆలాగుననే జరుగును.