బంధువు
రూతు 3:2

ఎవని పనికత్తెల యొద్ద నీవు ఉంటివో ఆ బోయజు మనకు బంధువుడు . ఇదిగో యీ రాత్రి అతడు కళ్లమున యవలు తూర్పారబట్టింప బోవుచున్నాడు.

రూతు 3:12

నేను నిన్ను విడిపింపగలవాడనను మాట వాస్తవమే ; అయితే నీకు నాకంటె సమీపమైన బంధువు డొకడున్నాడు .

చాల ఆస్తిపరుడు
ద్వితీయోపదేశకాండమ 8:17

అయితే మీరు మా సామర్థ్యము మా బాహుబలము ఇంత భాగ్యము మాకు కలుగజేసెనని అనుకొందురేమో.

ద్వితీయోపదేశకాండమ 8:18

కాగా నీ దేవుడైన యెహోవాను జ్ఞాపకము చేసికొనవలెను. ఏలయనగా తాను నీ పితరులతో ప్రమాణము చేసినట్లు తన నిబంధనను నేటివలె స్థాపింపవలెనని మీరు భాగ్యము సంపాదించుకొనుటకై మీకు సామర్థ్యము కలుగజేయువాడు ఆయనే.

యోబు గ్రంథము 1:3

అతనికి ఏడువేల గొఱ్ఱలును మూడువేల ఒంటెలును ఐదువందల జతల యెడ్లును ఐదువందల ఆడు గాడిదలును కలిగి, బహుమంది పనివారును అతనికి ఆస్తిగానుండెను గనుక తూర్పుదిక్కు జనులందరిలో అతడే గొప్పవాడుగానుండెను.

యోబు గ్రంథము 31:25
నా ఆస్తి గొప్పదని గాని నా చేతికి విస్తారము సొత్తు దొరికెనని గాని నేను సంతోషించిన యెడలను
బోయజు
రూతు 4:21

బోయజు ఓబేదును కనెను , ఓబేదు యెష్షయిని కనెను ,

న్యాయాధిపతులు 12:8-10
8

అతని తరువాత బేత్లెహేమువాడైన ఇబ్సాను ఇశ్రాయేలీయులకు అధిపతియాయెను.

9

అతనికి ముప్పదిమంది కుమారులును ముప్పదిమంది కుమార్తెలును ఉండిరి. అతడు ఆ కుమార్తెలను తన వంశమున చేరనివారికిచ్చి, తన వంశమునకు చేరని ముప్పది మంది కన్యలను తన కుమారులకు పెండ్లి చేసెను. అతడు ఏడేండ్లు ఇశ్రాయేలీయులకు అధిపతిగా నుండెను.

10

ఇబ్సాను చనిపోయి బేత్లెహేములో పాతిపెట్టబడెను.

1దినవృత్తాంతములు 2:10-12
10

రాము అమీ్మనాదాబును కనెను, అమీ్మనాదాబు యూదావారికి పెద్దయైన నయస్సోనును కనెను.

11

నయస్సోను శల్మాను కనెను, శల్మా బోయజును కనెను,

12

బోయజు ఓబేదును కనెను, ఓబేదు యెష్షయిని కనెను,

మత్తయి 1:5

నయస్సోను శల్మానును కనెను, శల్మాను రాహాబునందు బోయజును కనెను, బోయజు రూతునందు ఓబేదును కనెను, ఓబేదు యెష్షయిని కనెను;

లూకా 3:32

దావీదు యెష్షయికి, యెష్షయి ఓబేదుకు, ఓబేదు బోయజుకు, బోయజు శల్మానుకు, శల్మాను నయస్సోనుకు,