గుడారము
పరమగీతములు 1:5

యెరూషలేము కుమార్తెలారా, నేను నల్లనిదాననైనను సౌందర్యవంతురాలను కేదారువారి గుడారములవలెను సొలొమోను నగరు తెరలవలెను నేను సౌందర్యవంతురాలను

యెషయా 13:20

అది మరెన్నడును నివాసస్థలముగా నుండదు తరతరములకు దానిలో ఎవడును కాపురముండడు అరబీయులలో ఒకడైనను అక్కడ తన గుడారము వేయడు గొఱ్ఱలకాపరులు తమ మందలను అక్కడ పరుండనియ్యరు

మిడతలవలె
న్యాయాధిపతులు 7:12

మిద్యానీయులును అమాలేకీయులును తూర్పువారును లెక్కకు మిడతలవలె ఆ మైదానములో పరుండి యుండిరి. వారి ఒంటెలు సముద్రతీరమందున్న యిసుక రేణువులవలె లెక్కలేనివై యుండెను.

న్యాయాధిపతులు 8:10

అప్పుడు జెబహును సల్మున్నాయు వారితోకూడ వారి సేనలును, అనగా తూర్పు జనుల సేనలన్నిటిలో మిగిలిన యించు మించు పదునైదు వేలమంది మనుష్యులందరును కర్కోరులో నుండిరి. కత్తి దూయు నూట ఇరువదివేల మంది మనుష్యులు పడిపోయిరి.

యిర్మీయా 46:23

లెక్కలేనివారై మిడతలకన్న విస్తరింతురు చొర శక్యముకాని ఆమె అరణ్యమును నరికివేయుదురు.

వారి ఒంటెలును
న్యాయాధిపతులు 8:21

అప్పుడు జెబహు పల్మున్నాలు ప్రాయముకొలది నరునికి శక్తియున్నది గనుక నీవు లేచి మామీద పడుమని చెప్పగా గిద్యోను లేచి జెబహును సల్మున్నాను చంపి వారి ఒంటెల మెడల మీదనున్న చంద్రహారములను తీసికొనెను.

1 సమూయేలు 30:17

దావీదు సంగతిని గ్రహించి సంధ్యవేళ మొదలుకొని మరునాటి సాయంత్రము వరకు వారిని హతము చేయుచుండగా, ఒంటెల మీద ఎక్కి పారిపోయిన నాలుగు వందల మంది యౌవనులు తప్ప తప్పించుకొనినవాడు ఒకడును లేకపోయెను .

యెషయా 60:6

ఒంటెల సమూహము మిద్యాను ఏయిఫాల లేత ఒంటెలును నీ దేశముమీద వ్యాపించును వారందరు షేబనుండి వచ్చెదరు బంగారమును ధూపద్రవ్యమును తీసికొనివచ్చెదరు యెహోవా స్తోత్రములను ప్రకటించెదరు.

యిర్మీయా 49:29

వారి గుడారములను గొఱ్ఱల మందలను శత్రువులు కొనిపోవుదురు తెరలను ఉపకరణములను ఒంటెలను వారు పట్టుకొందురు నఖముఖాల భయమని వారు దానిమీద చాటింతురు

యిర్మీయా 49:32

వారి ఒంటెలు దోపుడుసొమ్ముగా ఉండును వారి పశువులమందలు కొల్లసొమ్ముగా ఉండును గడ్డపు ప్రక్కలను కత్తిరించుకొనువారిని నఖముఖాల చెదరగొట్టుచున్నాను నలుదిక్కులనుండి ఉపద్రవమును వారిమీదికి రప్పించుచున్నాను ఇదే యెహోవా వాక్కు,

పాడుచేయుటకు
కీర్తనల గ్రంథము 83:4-12
4

వారు ఇశ్రాయేలను పేరు ఇకను జ్ఞాపకము రాకపోవునట్లు జనముగానుండకుండ వారిని సంహరించుదము రండని చెప్పుకొనుచున్నారు .

5

ఏకమనస్సుతో వారు ఆలోచన చేసికొనియున్నారు నీకు విరోధముగా నిబంధన చేయుచున్నారు .

6

గుడారపువాసులైన ఎదోమీయులును ఇష్మాయేలీయులును మోయాబీయులును హగ్రీయీలును

7

గెబలువారును అమ్మోనీయులును అమాలేకీయులును ఫిలిష్తీయులును తూరు నివాసులును నీకు విరోధముగా నిబంధన చేసికొనియున్నారు.

8

అష్షూరు దేశస్థులు వారితో కలిసియున్నారు లోతు వంశస్థులకు వారు సహాయము చేయుచున్నారు .(సెలా.)

9

మిద్యానునకు నీవు చేసినట్లు కీషోను ఏటియొద్దను నీవు సీసెరాకును యాబీనునకును చేసినట్లు వారికిని చేయుము .

10

వారు ఏన్దోరులో నశించిరి భూమికి పెంట అయిరి .

11

ఓరేబు జెయేబు అనువారికి నీవు చేసినట్లు వారి ప్రధానులకును చేయుము జెబహు సల్మున్నా అనువారికి చేసినట్లు వారి సకల రాజులకును చేయుము.

12

దేవుని నివాసస్థలములను మనము ఆక్రమించుకొందమని వారు చెప్పుకొనుచున్నారు .