ఇశ్రా యేలీయులు
1 సమూయేలు 7:6

వారు మిస్పాలో కూడుకొని నీళ్లు చేది యెహోవా సన్నిధిని కుమ్మరించి ఆ దినము ఉపవాసముండి -యెహోవా దృష్టికి మేము పాపాత్ములమని ఒప్పుకొనిరి . మిస్పాలో సమూయేలు ఇశ్రాయేలీయులకు న్యాయము తీర్చుచువచ్చెను.

ఎజ్రా 10:1

ఎజ్రా యేడ్చుచు దేవుని మందిరము ఎదుట సాష్టాంగపడుచు, పాపమును ఒప్పుకొని ప్రార్థనచేసెను. ఇశ్రాయేలీయులలో పురుషులు స్త్రీలు చిన్నవారు మిక్కిలి గొప్ప సమూహముగా అతని యొద్దకు కూడివచ్చి బహుగా ఏడ్వగా

సామెతలు 17:10

బుద్ధిహీనునికి నూరుదెబ్బలు నాటునంతకంటె బుద్ధిమంతునికి ఒక గద్దింపుమాట లోతుగా నాటును.

యిర్మీయా 31:9

వారు ఏడ్చుచు వచ్చెదరు, వారు నన్ను ప్రార్థించుచుండగా నేను వారిని నడిపించుదును, వారు తొట్రిల్లకుండ చక్కగా పోవు బాటను నీళ్ల కాలువల యొద్ద వారిని నడిపింతును. ఇశ్రాయేలునకు నేను తండ్రిని కానా? ఎఫ్రాయిము నా జ్యేష్ఠ కుమారుడు కాడా?

జెకర్యా 12:10

దావీదు సంతతి వారిమీదను యెరూషలేము నివాసుల మీదను కరుణ నొందించు ఆత్మను విజ్ఞాపనచేయు ఆత్మను నేను కుమ్మరింపగా వారు తాము పొడిచిన నామీద దృష్టియుంచి , యొకడు తన యేక కుమారుని విషయమై దుఃఖించునట్లు ,తన జ్యేష్ఠపుత్రుని విషయమై యొకడు ప్రలాపించునట్లు అతని విషయమై దుఃఖించుచు ప్రలాపింతురు .

లూకా 6:21

ఇప్పుడు అకలిగొనుచున్న మీరు ధన్యులు, మీరు తృప్తి పరచబడుదురు. ఇప్పుడు ఏడ్చుచున్న మీరు ధన్యులు, మీరు నవ్వుదురు.

లూకా 7:38

వెనుకతట్టు ఆయన పాదముల యొద్ద నిలువబడి , యేడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి , తన తల వెండ్రుకలతో తుడిచి , ఆయన పాదములను ముద్దుపెట్టుకొని , ఆ అత్తరు వాటికి పూసెను .

2 కొరింథీయులకు 7:10

దైవచిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారుమనస్సును కలుగజేయును; ఈ మారుమనస్సు దుఃఖమును పుట్టించదు. అయితే లోకసంబంధమైన దుఃఖము మరణమును కలుగజేయును.

యాకోబు 4:9

వ్యాకులపడుడి, దుఃఖపడుడి, యేడువుడి, మీ నవ్వు దుఃఖమునకును మీ ఆనందము చింతకును మార్చుకొనుడి.