అయిదవ దినమున అతడు వెళ్లవలెనని ఉదయమున లేచినప్పుడు ఆ చిన్నదాని తండ్రి నీవు నీ ప్రాణము బలపరచుకొనుమని చెప్పినందున వారు ప్రొద్దు వ్రాలు వరకు తడవుచేసి యిద్దరు కూడి భోజనము చేసిరి.
కొంచెము ఆహారము తెచ్చెదను; మీ ప్రాణములను బలపరచు కొనుడి; తరువాత మీరు వెళ్లవచ్చును; ఇందు నిమిత్తము గదా మీ దాసుని యొద్దకు వచ్చితిరనెను. వారునీవు చెప్పి నట్లు చేయుమనగా
అయితే యోనాతాను తన తండ్రి జనులచేత చేయించిన ప్రమాణము విన లేదు . గనుక తన చేతి కఱ్ఱ చాపి దాని కొనను తేనెపట్టులో ముంచి తన చెయ్యి నోటిలో పెట్టుకొనగా అతని కన్నులు ప్రకాశించెను .
జనులలో ఒకడు -నీ తండ్రి జనులచేత ప్రమాణము చేయించి-ఈ దినమున ఆహారము పుచ్చుకొనువాడు శపింపబడునని ఖండితముగా ఆజ్ఞాపించి యున్నాడు; అందుచేతనే జనులు బహు బడలియున్నారని చెప్పెను .
అందుకు యోనాతాను అందుచేత నా తండ్రి జనులను కష్టపెట్టినవాడాయెను ; నేను ఈ తేనె కొంచెము పుచ్చుకొన్న మాత్రమున నా కన్నులు ఎంత ప్రకాశించుచున్నవో చూడుడి
వాడు భోజనము చేసిన తరువాత వాని ప్రాణము తెప్పరిల్లగా
అప్పుడు రాజు నీవు నా యింటికి వచ్చి అలసట తీర్చుకొనుము, నీకు బహుమతి ఇచ్చెదనని ఆ దైవజనునితో చెప్పగా
యేసు వారిని చూచినన్ను పంపినవాని చిత్తము నెరవేర్చుటయు, ఆయన పని తుదముట్టించుటయు నాకు ఆహారమై యున్నది.
పిమ్మట అతడు దమస్కులోనున్న శిష్యులతోకూడ కొన్ని దినములుండెను.