ఆయన పాదములు
ప్రకటన 2:18

తుయతైరలో ఉన్న సంఘపు దూతకు ఈలాగు వ్రాయుము- అగ్నిజ్వాలవంటి కన్నులును అపరంజినిపోలిన పాదములునుగల దేవుని కుమారుడు చెప్పు సంగతులేవనగా

యెహెజ్కేలు 1:7

వాటి కాళ్లు చక్కగా నిలువబడినవి , వాటి అర కాళ్లు పెయ్య కాళ్లవలె ఉండెను, అవి తళతళలాడు ఇత్తడివలె ఉండెను.

యెహెజ్కేలు 40:3

అక్కడికి ఆయన నన్ను తోడుకొని రాగా ఒక మనుష్యుడుండెను . ఆయన మెరయుచున్న యిత్తడి వలె కనబడెను , దారమును కొల కఱ్ఱయు చేత పట్టుకొని ద్వారములో ఆయన నిలువబడియుండెను .

దానియేలు 10:6

అతనిశరీరము రక్తవర్ణపు రాతివంటిది, అతని ముఖము మెరుపు వలె ఉండెను, అతని కన్నులు జ్వాలామయమైన దీపములను , అతని భుజములును పాదములును తళతళలాడు ఇత్తడిని పోలియుండెను . అతని మాటల ధ్వని నరసమూహపు కంఠధ్వనివలె ఉండెను

ఆయన కంఠస్వరము
ప్రకటన 14:2

మరియు విస్తారమైన జలముల ధ్వనితోను గొప్ప ఉరుము ధ్వనితోను సమానమైన యొక శబ్దము పరలోకములోనుండి రాగా వింటిని. నేను వినిన ఆ శబ్దము వీణెలు వాయించుచున్న వైణికుల నాదమును పోలినది.

ప్రకటన 19:6

అప్పుడు గొప్ప జనసమూహపు శబ్దమును, విస్తారమైన జలముల శబ్దమును, బలమైన ఉరుముల శబ్దమును పోలిన యొక స్వరము -సర్వాధికారియు ప్రభువునగు మన దేవుడు ఏలుచున్నాడు;

కీర్తనల గ్రంథము 93:4

విస్తారజలముల ఘోషలకంటెను బలమైన సముద్ర తరంగముల ఘోషలకంటెను ఆకాశమునందు యెహోవా బలిష్ఠుడు

యెషయా 17:13

జనములు విస్తారజలముల ఘోషవలె ఘోషించును ఆయన వారిని బెదరించును వారు దూరముగా పారిపోవుదురు కొండమీది పొట్టు గాలికి ఎగిరిపోవునట్లు తుపాను ఎదుట గిరగిర తిరుగు కసువు ఎగిరిపోవునట్లు వారును తరుమబడుదురు.

యెహెజ్కేలు 43:2

ఇశ్రాయేలీయుల దేవుని ప్రభావము తూర్పు దిక్కున కనబడెను ; దానినుండి పుట్టిన ధ్వని విస్తార జలముల ధ్వనివలె వినబడెను, ఆయన ప్రకాశముచేత భూమి ప్రజ్వరిల్లెను .