అతడీలాగు చెప్పిన తరువాత వారిని దీవించి వెళ్లనంపగా వారు తమ నివాస ములకు పోయిరి.
యెహొషువ 22:7

మోషే బాషానులో మనష్షే అర్ధగోత్రమునకును, యెహోషువ పడమటిదిక్కున యొర్దాను అద్దరిని వారి సహోదరులలో మిగిలిన అర్ధగోత్రమునకును స్వాస్థ్యములిచ్చిరి. మరియు యెహోషువ వారి నివాసములకు వారిని వెళ్లనంపినప్పుడు అతడు వారిని దీవించి వారితో ఇట్లనెను

యెహొషువ 22:8

మీరు మిక్కిలి కలిమిగలవారై అతి విస్తారమైన పశువులతోను వెండితోను బంగారుతోను ఇత్తడితోను ఇనుముతోను అతివిస్తారమైన వస్త్రములతోను తిరిగి మీ నివాసములకు వెళ్లుచున్నారు. మీ శత్రువుల దోపుడు సొమ్మును మీరును మీ సహోదరులును కలిసి పంచుకొనుడి.

యెహొషువ 14:13

యెఫున్నె కుమారుడైన కాలేబు ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాను నిండు మనస్సుతో అనుసరించువాడు గనుక యెహోషువ అతని దీవించి అతనికి హెబ్రోనును స్వాస్థ్యముగా ఇచ్చెను.

ఆదికాండము 14:19

అప్పుడతడు అబ్రామును ఆశీర్వదించి ఆకాశమునకు భూమికిని సృష్టికర్తయును సర్వోన్నతుడునైన దేవునివలన అబ్రాము ఆశీర్వదింపబడునుగాక అనియు,

ఆదికాండము 47:7

మరియు యోసేపు తన తండ్రియైన యాకోబును లోపలికి తీసికొనివచ్చి ఫరో సమక్షమందు అతని నుంచగా యాకోబు ఫరోను దీవించెను.

ఆదికాండము 47:10

ఫరోను దీవించి ఫరో యెదుటనుండి వెళ్లిపోయెను.

నిర్గమకాండము 39:43

మోషే ఆ పని అంతయు చూచినప్పుడు యెహోవా ఆజ్ఞాపించి నట్లు వారు దానిని చేసియుండిరి ; ఆలాగుననే చేసియుండిరి గనుక మోషే వారిని దీవించెను .

1 సమూయేలు 2:20

యెహోవా సన్నిధిని మనవిచేసికొనగా నీకు దొరకిన యీ సంతానమునకు ప్రతిగా యెహోవా నీకు సంతానము నిచ్చునుగాక అని ఏలీ ఎల్కానాను అతని భార్యను దీవించిన తరువాత వారు ఇంటికి వెళ్లిరి .

2 సమూయేలు 6:18

దహనబలులను సమాధానబలులను అర్పించుట చాలించిన తరువాత సైన్యములకధిపతియగు యెహోవా నామమున దావీదు జనులను ఆశీర్వదించి,

2 సమూయేలు 6:20

తన యింటివారిని దీవించుటకు దావీదు తిరిగి రాగా సౌలు కుమార్తెయగు మీకాలు దావీదును ఎదుర్కొన బయలుదేరి వచ్చిహీనస్థితి గల పనికత్తెలు చూచుచుండగా వ్యర్థుడొకడు తన బట్టలను విప్పివేసినట్టుగా ఇశ్రాయేలీయులకు రాజువైన నీవు నేడు బట్టలను తీసివేసియెంత ఘనముగా కనబడితివని అపహాస్యము చేసినందున దావీదు

2 దినవృత్తాంతములు 30:18

ఎఫ్రాయిము మనష్షే ఇశ్శాఖారు జెబూలూను దేశములనుండి వచ్చిన జనులలో చాలామంది తమ్మునుతాము ప్రతిష్ఠించుకొనకయే విధివిరుద్ధముగా పస్కాను భుజింపగా హిజ్కియా

లూకా 2:34

సుమెయోను వారిని దీవించి ఇదిగో అనేక హృదయాలోచనలు బయలుపడునట్లు, ఇశ్రాయేలులో అనేకులు పడుటకును తిరిగి లేచుటకును వివాదాస్పదమైన గురుతుగా ఈయన నియమింపబడియున్నాడు;

లూకా 24:50

ఆయన బేతనియ వరకు వారిని తీసికొనిపోయి చేతు లెత్తి వారిని ఆశీర్వదించెను .

హెబ్రీయులకు 7:6

వారితో సంబంధించిన వంశావళి లేనివాడైన మెల్కీసెదెకు అబ్రాహామునొద్ద పదియవవంతు పుచ్చుకొని వాగ్దానములను పొందినవానిని ఆశీర్వదించెను.

హెబ్రీయులకు 7:7

తక్కువవాడు ఎక్కువ వానిచేత ఆశీర్వదింపబడునను మాట కేవలము నిరాక్షేపమై యున్నది.