బడి
ఆదికాండము 13:17

నీవు లేచి యీ దేశముయొక్క పొడుగున వెడల్పున దానిలో సంచరించుము; అది నీకిచ్చెదనని అబ్రాముతో చెప్పెను.

అప్పుడు నేను షిలోహులో
యెహొషువ 18:6

మీరు ఏడు వంతులుగా దేశవివరమును వ్రాసి నా యొద్దకు తీసికొని రావలెను. నేను ఇక్కడ మన దేవుడైన యెహోవా సన్నిధిని మీ నిమిత్తము వంతుచీట్లు వేసెదను.

యెహొషువ 18:10

వారికొరకు యెహోషువ షిలోహులో యెహోవా సన్నిధిని వంతుచీట్లు వేసి వారి వారి వంతులచొప్పున ఇశ్రాయేలీయులకు దేశమును పంచి పెట్టెను.

యెహొషువ 7:16-18
16

కాబట్టి యెహోషువ ఉదయమున లేచి ఇశ్రాయేలీయులను వారి గోత్రముల వరుసనుబట్టి దగ్గరకు రప్పించినప్పుడు యూదాగోత్రము పట్టుబడెను.

17

యూదా వంశమును దగ్గరకు రప్పించినప్పుడు జెరహీయుల వంశము పట్టుబడెను. జెరహీయుల వంశమును పురుషుల వరుసను దగ్గరకు రప్పించినప్పుడు జబ్ది పట్టబడెను.

18

అతడును అతని యింటి పురుషుల వరుసను దగ్గరకు రప్పింపబడినప్పుడు యూదా గోత్రములోని జెరహు మునిమనుమడును జబ్ది మనుమడును కర్మీ కుమారుడునైన ఆకాను పట్టుబడెను.

యెహొషువ 13:7

తొమి్మది గోత్రములకును మనష్షే అర్ధ గోత్రమునకును ఈ దేశమును స్వాస్థ్యముగా పంచిపెట్టుము. యెహోవా సేవకుడైన మోషే వారికిచ్చినట్లు

యెహొషువ 14:1

ఇశ్రాయేలీయులు కనాను దేశమున పొందిన స్వాస్థ్యములు ఇవి.

యెహొషువ 14:2

మోషేద్వారా యెహోవా ఆజ్ఞాపించినట్లు యాజకుడైన ఎలియాజరును నూను కుమారుడైన యెహోషువయు ఇశ్రాయేలీయుల గోత్రములయొక్క పితరుల కుటుంబముల ప్రధానులును చీట్లు వేసి, తొమి్మది గోత్రములవారికిని అర్ధగోత్రపువారికిని ఆ స్వాస్థ్యములను పంచిపెట్టిరి.

యెహొషువ 15:1

యూదా వంశస్థుల గోత్రమునకు వారి వంశములచొప్పున చీట్లవలన వచ్చినవంతు ఎదోము సరిహద్దువరకును, అనగా దక్షిణదిక్కున సీను అరణ్యపు దక్షిణ దిగంతము వరకును ఉండెను.

1 సమూయేలు 14:41

అప్పుడు సౌలు -ఇశ్రాయేలీయులకు దేవుడవైన యెహోవా , దోషిని కనుపరచుమని ప్రార్థింపగా సౌలు పేరటను యోనాతాను పేరటను చీటిపడెను గాని జనులు తప్పించుకొనిరి .

అపొస్తలుల కార్యములు 1:24-26
24

ఇట్లని ప్రార్థనచేసిరి అందరి హృదయములను ఎరిగియున్న ప్రభువా,

25

తన చోటికి పోవుటకు యూదా తప్పిపోయి పోగొట్టుకొనిన యీ పరిచర్యలోను అపొస్తలత్వములోను పాలుపొందుటకు వీరిద్దరిలో నీవు ఏర్పరచుకొనినవానిని కనబరచుమనిరి.

26

అంతట వారు వీరినిగూర్చి చీట్లువేయగా మత్తీయపేరట చీటి వచ్చెను గనుక అతడు పదునొకండుమంది అపొస్తలులతో కూడ లెక్కింపబడెను.

రోమీయులకు 14:19

కాబట్టి సమాధానమును , పరస్పర క్షేమాభివృద్ధిని కలుగజేయు వాటినే ఆసక్తితో అనుసరింతము .