అయితే మీ హృదయములలో సహింపనలవికాని మత్సరమును వివాదమును ఉంచుకొనినవారైతే అతిశయపడవద్దు, సత్యమునకు విరోధముగా అబద్ధమాడవద్దు.
శూరుడా, చేసిన కీడునుబట్టి నీ వెందుకు అతిశయపడుచున్నావు? దేవుని కృప నిత్యముండును.
ఇదిగో దేవుని తనకు దుర్గముగా నుంచుకొనక తన ధనసమృద్ధియందు నమి్మకయుంచి తన చేటును బలపరచుకొనినవాడు వీడేయని చెప్పుకొనుచు వానిని చూచి నవ్వుదురు.
కపటమనస్సుతో దానమిచ్చి డంబము చేయువాడు వర్షములేని మబ్బును గాలిని పోలియున్నాడు.
రేపటి దినమునుగూర్చి అతిశయపడకుము ఏ దినమున ఏది సంభవించునో అది నీకు తెలియదు.
నేను సర్వదా దొరసానినై యుందునని నీవనుకొని వీటిని ఆలోచింప కపోతివి వాటి ఫలమేమవునో మనస్సునకు తెచ్చుకొనకపోతివి .
కాబట్టి సుఖాసక్తురాలవై నిర్భయముగా నివసించుచు నేనే ఉన్నాను నేను తప్ప మరి ఎవరును లేరు నేను విధవరాలనై కూర్చుండను పుత్రశోకము నేను చూ డనని అనుకొనుచున్నదానా , ఈ మాటను వినుము
నీ చెడుతనమును నీవు ఆధారము చేసికొని యెవడును నన్ను చూడడని అనుకొంటివి నేనున్నాను నేను తప్ప మరి ఎవరును లేరని నీవనుకొనునట్లుగా నీ విద్యయు నీ జ్ఞానమును నిన్ను చెరిపివేసెను .
ఎందుకనగా నీకు ఆధిక్యము కలుగజేయువాడెవడు? నీకు కలిగిన వాటిలో పరునివలన నీవు పొందనిది ఏది?పొందియుండియు పొందనట్టు నీవు అతిశయింపనేల?
ఇదివరకే మీరేమియు కొదువలేక తృప్తులైతిరి, ఇదివరకే ఐశ్వర్యవంతులైతిరి, మమ్మును విడిచిపెట్టి మీరు రాజులైతిరి; అవును, మేమును మీతోకూడ రాజులమగునట్లు మీరు రాజులగుట నాకు సంతోషమే గదా?
మీరు అతిశయపడుట మంచిదికాదు. పులిసినపిండి కొంచెమైనను ముద్దంతయు పులియజేయునని మీరెరుగరా?
అది -నేను రాణినిగా కూర్చుండుదానను, నేను విధవరాలను కాను, దుఃఖము చూడనే చూడనని తన మనస్సులో అనుకొనెను గనుక, అది తన్నుతాను ఎంతగా గొప్ప చేసికొని సుఖభోగములను అనుభవించెనో అంతగా వేదనను దుఃఖమును దానికి కలుగజేయుడి.