యెహోవా అగ్నితో సీనాయి పర్వతముమీదికి దిగివచ్చినందున అదంతయు ధూమమయమైయుండెను. దాని ధూమము కొలిమి ధూమమువలె లేచెను, పర్వతమంతయు మిక్కిలి కంపించెను.
కొండలారా , మీరు పొట్లేళ్లవలెను గుట్టలారా , మీరు గొఱ్ఱపిల్లలవలెను గంతులు వేయుటకు మీకేమి సంభవించినది?
భూమీ , ప్రభువు సన్నిధిని యాకోబు దేవుని సన్నిధిని వణకుము
నిన్ను చూచి పర్వతములు కంపించును జలములు ప్రవాహములుగా పారును సముద్రాగాధము ఘోషించుచు తన చేతులు పై కెత్తును .
ఇంకొకసారి అను మాట చలింపచేయబడనివి నిలుకడగా ఉండు నిమిత్తము అవి సృష్టింపబడినవన్నట్టు చలింపచేయబడినవి బొత్తిగా తీసివేయబడునని అర్ధమిచ్చుచున్నది.
యెహోవా భూమిని గజగజ వణకింప లేచునప్పుడు ఆయన భీకర సన్నిధినుండియు ఆయన ప్రభావ మాహాత్మ్యమునుండియు మనుష్యులు కొండల గుహలలో దూరుదురు నేల బొరియలలో దూరుదురు .
సైన్యములకధిపతియగు యెహోవా ఉగ్రతకును ఆయన కోపాగ్ని దినమునకును ఆకాశము వణకునట్లును భూమి తన స్థానము తప్పునట్లును నేను చేసెదను.
యెహోవా సీయోనులో నుండి గర్జించుచున్నాడు ; యెరూషలేము లోనుండి తన స్వరము వినబడజేయుచున్నాడు ; భూమ్యా కాశములు వణకుచున్నవి . అయితే యెహోవా తన జనులకు ఆశ్రయమగును , ఇశ్రాయేలీయులకు దుర్గముగా ఉండును.
మరియు సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చునదేమనగా ఇక కొంతకాలము ఇంకొకమారు ఆకాశమును భూమిని సముద్రమును నేలను నేను కంపింపజేతును.
నేను అన్యజనులనందరిని కదలింపగా అన్యజనులందరి యొక్క యిష్టవస్తువులు తేబడును; నేను ఈ మందిరమును మహిమతో నింపుదును; ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు.
రాజ్యముల సింహాసనములను నేను క్రింద పడవేతును; అన్యజనుల రాజ్యములకు కలిగిన బలమును నాశనము చేతును; రథములను వాటిని ఎక్కిన వారిని క్రింద పడవేతును; గుఱ్ఱములును రౌతులును ఒకరి ఖడ్గముచేత ఒకరు కూలుదురు.