మరియు నీ దేవుడైన యెహోవా నీ కప్పగించుచున్న సమస్త ప్రజలను నీవు బొత్తిగా నాశనముచేయుదువు. నీవు వారిని కటాక్షింపకూడదు, వారి దేవతలను పూజింపకూడదు, ఏలయనగా అది నీకు ఉరియగును.
వారి మాటకు సమ్మతింపకూడదు; వారిమాట వినకూడదు, వారిని కటాక్షింపకూడదు; వారియందు జాలిపడకూడదు, వారిని మాటుపరచకూడదు; అవశ్యముగా వారిని చంపవలెను.
నీ కన్ను కటాక్షింపకూడదు.
ఈ పనులలో ఒకటైనను నీకు చేయవలెనని యెవరును కటాక్షింపలేదు , నీయందు జాలిపడినవాడొకడును లేక పోయెను; నీవు పుట్టిన నాడే బయట నేలను పారవేయబడి , చూడ అసహ్యముగా ఉంటివి.
అట్లు నీవు యెహోవా దృష్టికి యథార్థమైనది చేయునప్పుడు నీ మధ్యనుండి నిర్దోషియొక్క ప్రాణము విషయమైన దోషమును పరిహరించెదవు.
నరుని రక్తమును చిందించువాని రక్తము నరునివలననే చిందింపబడును; ఏలయనగా దేవుడు తన స్వరూపమందు నరుని చేసెను.
ఎవడైనను ఒకనిని ప్రాణహత్యచేసినయెడల వానికి మరణశిక్ష విధింపవలెను.
జంతువును చావగొట్టినవాడు దాని నష్టము నిచ్చుకొనవలెను. నరహత్యచేసినవానికి మరణశిక్ష విధింపవలెను.
మీరుండు దేశమును అపవిత్రపరచకూడదు; నరహత్య దేశమును అపవిత్రపరచును గదా. దేశములో చిందిన రక్తము నిమిత్తము చిందించిన వాని రక్తమువలననే ప్రాయశ్చిత్తము కలుగును గాని మరి దేనివలనను కలుగదు.
మీరు నివసించు దేశమును అపవిత్రపరచకూడదు. అందులో నేను మీ మధ్యను నివసించుచున్నాను. నిజముగా యెహోవా అను నేను ఇశ్రాయేలీయులమధ్య నివసించుచున్నాను.
దావీదు కాలమున మూడు సంవత్సరములు విడువకుండ కరవు కలుగగా దావీదు యెహోవాతో మనవి చేసెను. అందుకు యెహోవా ఈలాగున సెలవిచ్చెను సౌలు గిబియోనీయులను హతముచేసెను గనుక అతనిని బట్టియు, నరహంతకులగు అతని యింటివారినిబట్టియు శిక్షగా ఈ కరవు కలిగెను.
సౌలు ఎముకలను అతని కుమారుడైన యోనాతాను ఎముకలను బెన్యామీనీయుల దేశమునకు చేరిన సేలాలోనున్న సౌలు తండ్రియగు కీషు సమాధియందు పాతిపెట్టిరి. రాజు ఈలాగు చేసిన తరువాత దేశముకొరకు చేయబడిన విజ్ఞాపనమును దేవుడంగీకరించెను.
అందుకు రాజు ఇట్లనెను అతడు నీతో చెప్పినట్లుగా చేయుము; అతడు ధారపోసిన నిరపరాధుల రక్తమును నామట్టుకును నా తండ్రి కుటుంబికులమట్టుకును పరిహారము చేయుటకై అతని చంపి పాతిపెట్టుము.