అట్టి క్రియలు
ఎఫెసీయులకు 5:3

మీలో జారత్వమే గాని, యే విధమైన అపవిత్రతయే గాని, లోభత్వమేగాని, వీటి పేరైనను ఎత్తకూడదు, ఇదే పరిశుద్ధులకు తగినది.

రోమీయులకు 1:24-27
24

ఈ హేతువుచేత వారు తమ హృదయముల దురాశలను అనుసరించి , తమ శరీరములను పరస్పరము అవమాన పరచుకొనునట్లు దేవుడు వారిని అపవిత్రతకు అప్పగించెను .

25

అట్టివారు దేవుని సత్యమును అసత్యమునకు మార్చి , సృష్టికర్తకు ప్రతిగా సృష్టమును పూజించి సేవించిరి . యుగముల వరకు ఆయన స్తోత్రార్హుడై యున్నాడు , ఆమేన్‌ .

26

అందువలన దేవుడు తుచ్ఛమైన అభిలాషలకు వారిని అప్పగించెను . వారి స్త్రీలు సయితము స్వాభావికమైన ధర్మమును విడిచి స్వాభావిక విరుద్ధమైన ధర్మమును అనుసరించిరి .

27

అటువలె పురుషులు కూడ స్త్రీయొక్క స్వాభావికమైన ధర్మమును విడిచి , పురుషుల తో పురుషులు అవాచ్యమైనది చేయుచు , తమ తప్పిదమునకు తగిన ప్రతిఫలమును పొందుచు ఒకరియెడల ఒకరు కామతప్తులైరి .

1 పేతురు 4:3

మనము పోకిరిచేష్టలు, దురాశలు, మద్యపానము, అల్లరితో కూడిన ఆటపాటలు, త్రాగుబోతుల విందులు, చేయదగని విగ్రహపూజలు మొదలైనవాటియందు నడుచుకొనుచు, అన్యజనుల ఇష్టము నెరవేర్చుచుండుటకు గతించినకాలమే చాలును,

రహస్యమందు
2 సమూయేలు 12:12

పగటియందు వాడు వారితో శయనించును. నీవు ఈ కార్యము రహస్యముగా చేసితివి గాని ఇశ్రాయేలీయులందరు చూచుచుండగా పగటియందే నేను చెప్పినదానిని చేయింతును అనెను.

సామెతలు 9:17

అది తెలివిలేనివాడొకడు వచ్చుట చూచి దొంగిలించిన నీళ్లు తీపి చాటున తినిన భోజనము రుచి అని చెప్పును.

ప్రసంగి 12:14

గూఢమైన ప్రతి యంశమునుగూర్చి దేవుడు విమర్శచేయునప్పుడు ఆయన ప్రతిక్రియను అది మంచిదే గాని చెడ్డదే గాని, తీర్పులోనికి తెచ్చును.

యిర్మీయా 23:24

యెహోవా సెలవిచ్చిన మాట ఏదనగా నాకు కనబడకుండ రహస్య స్థలములలో దాగగలవాడెవడైనకలడా? నేను భూమ్యా కాశముల యందంతట నున్నవాడను కానా? యిదే యెహోవా వాక్కు.

లూకా 12:1

అంతలో ఒకనినొకడు త్రొక్కుకొనునట్లు వేలకొలది జనులు కూడినప్పుడు ఆయన తన శిష్యుల తో మొదట ఇట్లని చెప్ప సాగెను పరిసయ్యుల వేషధారణ అను పులిసిన పిండినిగూర్చి జాగ్రత్తపడుడి.

లూకా 12:2

మరుగైన దేదియు బయలుపరచ బడకపోదు ; రహస్యమైన దేదియు తెలియ బడకపోదు .

రోమీయులకు 2:16

దేవుడు నా సువార్త ప్రకారము యేసు క్రీస్తు ద్వారా మనుష్యుల రహస్యములను విమర్శించు దిన మందు ఈలాగు జరుగును.

ప్రకటన 20:12

మరియు గొప్పవారేమి కొద్దివారేమి మృతులైనవారందరు ఆ సింహాసనము ఎదుట నిలువబడియుండుట చూచితిని. అప్పుడు గ్రంథములు విప్పబడెను; మరియు జీవగ్రంథమును వేరొక గ్రంథము విప్పబడెను; ఆ గ్రంథములయందు వ్రాయబడియున్న వాటినిబట్టి తమ క్రియలచొప్పున మృతులు తీర్పు పొందిరి.