ఆ దినములు తక్కువ చేయబడక పోయిన యెడల ఏ శరీరియు తప్పించుకొనడు. ఏర్పరచ బడినవారి నిమిత్తము ఆ దినములు తక్కువ చేయబడును.
ఏలయనగా ఓర్పు వలనను , లేఖనములవలని ఆదరణవలనను మనకు నిరీక్షణ కలుగుటకై పూర్వమందు వ్రాయబడిన వన్నియు మనకు బోధ కలుగు నిమిత్తము వ్రాయబడి యున్నవి.
ప్రభువైన యేసును లేపినవాడు యేసుతో మమ్మునుకూడ లేపి, మీతోకూడ తన యెదుట నిలువబెట్టునని యెరిగి,మేమును విశ్వసించుచున్నాము గనుక మాటలాడుచున్నాము.
మేము దేవుని జతపనివారమై యున్నాము; మీరు దేవుని వ్యవసాయమును దేవుని గృహమునైయున్నారు.
దున్నువాడు గాని మేపువాడు గాని మీలో ఎవనికైన ఒక దాసు డుండగా , వాడు పొలములో నుండి వచ్చినప్పుడు నీవు ఇప్పడే వెళ్లి భోజనము చేయుమని వానితో చెప్పునా ? చెప్పడు.
అంతేకాక నేను భోజనము చేయుటకు ఏమైనను సిద్ధపరచి , నడుము కట్టుకొని నేను అన్న పానములు పుచ్చుకొనువరకు నాకు పరిచారము చేయుము ; అటుతరువాత నీవు అన్న పానములు పుచ్చుకొనవచ్చునని వానితో చెప్పును గాని
ఇంక నాలుగు నెలలైన తరువాత కోతకాలము వచ్చునని మీరు చెప్పుదురు గదా. ఇదిగో మీ కన్నులెత్తి పొలములను చూడుడి; అవి ఇప్పుడే తెల్లబారి కోతకు వచ్చియున్నవని మీతో చెప్పుచున్నాను.
విత్తువాడును కోయువాడును కూడ సంతోషించునట్లు, కోయువాడు జీతము పుచ్చుకొని నిత్య జీవార్థ మైన ఫలము సమకూర్చుకొనుచున్నాడు.
విత్తువాడొకడు కోయువాడొకడను మాట యీ విషయములో సత్యమే.
మీరు దేనినిగూర్చి కష్టపడ లేదో దానిని కోయుటకు మిమ్మును పంపితిని; ఇతరులు కష్టపడిరి మీరు వారి కష్టఫలములో ప్రవేశించుచున్నారని చెప్పెను.
పాటుపడిన వ్యవసాయకుడే మొదట ఫలములలో పాలు పుచ్చుకొనవలసినవాడు.