ప్రవక్తలు ఇద్దరు ముగ్గురు మాటలాడవచ్చును; తక్కినవారు వివేచింపవలెను.
అయితే కూర్చున్న మరియొకనికి ఏదైనను బయలుపరచబడిన యెడల మొదటివాడు మౌనముగా ఉండవలెను.
వారు ఆ కొండదగ్గరకు వచ్చినప్పుడు ప్రవక్తల సమూహము అతనికి ఎదురుపడగా దేవుని ఆత్మ బలముగా అతని మీదికి వచ్చెను . అతడు వారి మధ్యను ఉండి ప్రకటన చేయుచుండెను.
పూర్వము అతని నెరిగిన వారందరు అతడు ప్రవక్తలతో కూడనుండి ప్రకటించుట చూచి -కీషు కుమారునికి సంభవించిన దేమిటి ? సౌలును ప్రవక్తలలో నున్నాడా? అని ఒకనితో ఒకడు చెప్పుకొనగా
ఆ స్థల మందుండు ఒకడు -వారి తండ్రి యెవడని యడిగెను . అందుకు సౌలును ప్రవక్తలలో నున్నాడా? అను సామెత పుట్టెను .
అంతట అతడు ప్రకటించుట చాలించి ఉన్నత స్థలమునకు వచ్చెను .
దావీదు రామాదగ్గర నాయోతులో ఉన్నాడని సౌలునకు వర్తమానము రాగా
దావీదును పట్టుకొనుటకై సౌలు దూతలను పంపెను ; వీరు వచ్చి ప్రవక్తలు సమాజముగా కూడుకొని ప్రకటించుటయు , సమూయేలు వారిమీద నాయకుడుగా నిలుచుటయు చూడగా దేవుని ఆత్మ సౌలు పంపిన దూతల మీదికి వచ్చెను గనుక వారును ప్రకటింప నారంభించిరి.
ఈ సంగతి సౌలునకు వినబడినప్పుడు అతడు వేరు దూతలను పంపెను గాని వారును అటువలెనే ప్రకటించుచుండిరి . సౌలు మూడవసారి దూతలను పంపెను గాని వారును ప్రకటించుచుండిరి .
కడవరిసారి తానే రామాకు పోయి సేఖూ దగ్గరనున్న గొప్ప బావి యొద్దకు వచ్చి -సమూయేలును దావీదును ఎక్కడ ఉన్నారని అడుగగా ఒకడు-రామా దగ్గర నాయోతులో వారున్నా రని చెప్పెను .
అతడు రామా దగ్గరనున్న నాయోతునకు రాగా దేవుని ఆత్మ అతని మీదికి వచ్చెను గనుక అతడు ప్రయాణము చేయుచు రామాదగ్గరనున్న నాయోతునకు వచ్చు వరకు ప్రకటించుచుండెను ,
మరియు అతడు తన వస్త్రములను తీసివేసి ఆ నాటి రాత్రిం బగళ్లు సమూయేలు ఎదుటనే ప్రకటించుచు , పైబట్టలేనివాడై పడియుండెను . అందువలన సౌలును ప్రవక్తలలోనున్నాడా అను సామెత పుట్టెను.
బేతేలులో ఉన్న ప్రవక్తల శిష్యులు ఎలీషా యొద్దకు వచ్చి నేడు యెహోవా నీయొద్దనుండి నీ గురువును పరమునకు తీసికొని పోవునని నీవెరుగుదువా అని ఎలీషాను అడుగగా అతడు నే నెరుగుదును ,మీరు ఊరకుండుడనెను .
యెరికోలో ఉన్న ప్రవక్తల శిష్యులు ఎలీషాయొద్దకు వచ్చి నేడు యెహోవా నీయొద్ద నుండి నీ గురువును పరమునకు తీసికొని పోవునని నీ వెరుగుదువా అని ఎలీషాను అడుగగా అతడు నేనెరుగుదును మీరు ఊరకుండుడనెను.
అయినను నరులలో ఆత్మ ఒకటి యున్నది సర్వశక్తుడగు దేవుని ఊపిరి వారికి వివేచన కలుగజేయును.
వృద్ధులు మాత్రమే జ్ఞానవంతులు కారు బహు వయస్సుగలవారు ఒకప్పుడు న్యాయము తెలిసినవారుకారు.
కావున నేను నా మాట నంగీకరించుడని మనవి చేసికొనుచున్నాను. నేను సహితము నా తాత్పర్యము తెలుపుదును.
ఏమి పలుకుదుమా అని మీరు యోచనచేయుచుండగా నేను మీ మాటలకొరకు కనిపెట్టుకొంటిని మీ అభిప్రాయములు చెవిని వేసికొనుటకై
ఆయన పేరు నేనెత్తను, ఆయన నామమును బట్టి ప్రకటింపను, అని నేనను కొంటినా? అది నా హృదయములో అగ్నివలె మండుచు నా యెముకలలోనే మూయబడియున్నట్లున్నది; నేను ఓర్చి యోర్చి విసికి యున్నాను, చెప్పక మానలేదు.
మేము కన్నవాటిని విన్నవాటిని చెప్పకయుండలేమని వారికి ఉత్తరమిచ్చిరి;
ప్రియులారా, అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకము లోనికి బయలు వెళ్లియున్నారు గనుక ప్రతి ఆత్మను నమ్మక, ఆ యా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించుడి.