పరిచర్య
1 కొరింథీయులకు 12:28

మరియు దేవుడు సంఘములో మొదట కొందరిని అపొస్తలులుగాను, పిమ్మట కొందరిని ప్రవక్తలుగాను, పిమ్మట కొందరిని బోధకులుగాను, అటుపిమ్మట కొందరిని అద్భుతములు చేయువారినిగాను, తరువాత కొందరిని స్వస్థపరచు కృపావరములు గలవారినిగాను, కొందరిని ఉపకారములు చేయువారినిగాను, కొందరిని ప్రభుత్వములు చేయువారిని గాను, కొందరిని నానా భాషలు మాటలాడువారినిగాను నియమించెను.

1 కొరింథీయులకు 12:29

అందరు అపొస్తలులా? అందరు ప్రవక్తలా? అందరు బోధకులా? అందరు అద్భుతములు చేయువారా? అందరు స్వస్థపరచు కృపావరములు గలవారా?

రోమీయులకు 12:6-8
6
మన కనుగ్రహింపబడిన కృప చొప్పున వెవ్వేరు కృపావరములు కలిగినవారమై యున్నాము గనుక ,
7
ప్రవచనవర మైతే విశ్వాస పరిమాణము చొప్పున ప్రవచింతము;పరిచర్య యైతే పరిచర్య లోను ,
8

బోధించువా డైతే బోధించుట లోను , హెచ్చరించువా డైతే హెచ్చరించుట లోను పనికలిగియుందము. పంచిపెట్టువాడు శుద్ధమనస్సు తోను , పైవిచారణ చేయువాడు జాగ్రత్త తోను , కరుణించువాడు సంతోషము తోను పని జరిగింపవలెను.

ఎఫెసీయులకు 4:11

మనమందరము విశ్వాసవిషయములోను దేవుని కువ ూరునిగూర్చిన జ్ఞానవిషయములోను ఏకత్వముపొంది సంపూర్ణపురుషులమగువరకు,

ఎఫెసీయులకు 4:12

అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవారమగువరకు, ఆయన ఈలాగు నియమించెను.

గాని
1 కొరింథీయులకు 8:6

ఆకాశమందైనను భూమిమీదనైనను దేవతలనబడినవి యున్నను, మనకు ఒక్కడే దేవుడున్నాడు. ఆయన తండ్రి; ఆయననుండి సమస్తమును కలిగెను; ఆయన నిమిత్తము మనమున్నాము. మరియు మనకు ప్రభువు ఒక్కడే; ఆయన యేసుక్రీస్తు; ఆయనద్వారా సమస్తమును కలిగెను; మనము ఆయనద్వారా కలిగినవారము.

మత్తయి 23:10

మరియు మీరు గురువులని పిలువబడవద్దు; క్రీస్తుఒక్కడే మీ గురువు.

అపొస్తలుల కార్యములు 10:36

యేసుక్రీస్తు అందరికి ప్రభువు. ఆయనద్వారా దేవుడు సమాధానకరమైన సువార్తను ప్రకటించి ఇశ్రాయేలీయులకు పంపిన వర్తమానము మీరెరుగుదురు.

రోమీయులకు 14:8

మనము బ్రదికినను ప్రభువు కోసమే బ్రదుకుచున్నాము ; చనిపోయినను ప్రభువు కోసమే చనిపోవుచున్నాము . కాబట్టి మనము బ్రదికినను చనిపోయినను ప్రభువువారమై యున్నాము .

రోమీయులకు 14:9

తాను మృతులకును సజీవులకును ప్రభువై యుండుటకు ఇందు నిమిత్తమే గదా క్రీస్తు చనిపోయి మరల బ్రదికెను .

ఫిలిప్పీయులకు 2:11

ప్రతివాని నాలుకయు తండ్రియైన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువని ఒప్పుకొనునట్లును, దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి, ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించెను.