అందుకు అహరోను మీ భార్యలకు మీ కుమారులకు మీ కుమార్తెలకు చెవులనున్న బంగారు పోగులను తీసి నాయొద్దకు తెండని వారితో చెప్పగా
ప్రజ లందరు తమ చెవులనున్న బంగారు పోగులను తీసి అహరోను నొద్దకు తెచ్చిరి .
అతడు వారి యొద్ద వాటిని తీసికొని పోగరతో రూపమును ఏర్పరచి దానిని పోత పోసిన దూడగా చేసెను . అప్పుడు వారు ఓ ఇశ్రాయేలూ , ఐగుప్తు దేశము లోనుండి నిన్ను రప్పించిన నీ దేవుడు ఇదే అనిరి.
అహరోను అది చూచి దాని యెదుట ఒక బలిపీఠము కట్టించెను . మరియు అహరోను రేపు యెహోవాకు పండుగ జరుగునని చాటింపగా
మరునాడు వారు ఉదయమున లేచి దహన బలులను సమాధానబలుల నర్పించిరి . అప్పుడు జనులు తినుటకును త్రాగుటకును కూర్చుండి ఆడుటకు లేచిరి .
కాగా యెహోవా మోషే తో ఇట్లనెను నీవు దిగి వెళ్లుము ; ఐగుప్తు దేశము నుండి నీవు రప్పించిన నీ ప్రజలు చెడిపోయిరి .
నేను వారికి నియమించిన త్రోవ నుండి త్వరగా తొలగిపోయి తమకొరకు పోతపోసిన దూడను చేసికొని దానికి సాగిలపడి బలినర్పించి ఓయి ఇశ్రాయేలూ , ఐగుప్తు దేశము నుండి నిన్ను రప్పించిన నీ దేవుడు ఇదే అని చెప్పుకొనిరనెను .
ఆ ప్రజలు పెద్దకేకలు వేయుచుండగా యెహోషువ ఆ ధ్వని విని పాళెములో యుద్ధ ధ్వని అని మోషే తో అనగా
అతడు అది జయ ధ్వని కాదు , అపజయ ధ్వని కాదు , సంగీత ధ్వని నాకు వినబడుచున్నదనెను .
అతడు పాళెము నకు సమీపింపగా , ఆ దూడను , వారు నాట్యమాడుటను చూచెను . అందుకు మోషే కోపము మండెను ; అతడు కొండ దిగువను తన చేతుల లోనుండి ఆ పలకలను పడవేసి వాటిని పగులగొట్టెను .
మరియు అతడు వారు చేసిన ఆ దూడను తీసికొని అగ్నితో కాల్చి పొడి చేసి నీళ్ల మీద చల్లి ఇశ్రాయేలీ యులచేత దాని త్రాగించెను .
నీవు లేచి యిక్కడ నుండి త్వరగా దిగుము; నీవు ఐగుప్తులోనుండి రప్పించిన నీ జనము చెడిపోయి, నేను వారి కాజ్ఞాపించిన త్రోవలో నుండి త్వరగా తొలగి తమకు పోతబొమ్మను చేసికొనిరని నాతో చెప్పెను.
మరియు యెహోవా నేను ఈ ప్రజలను చూచితిని; ఇదిగో వారు లోబడనొల్లని ప్రజలు.
నాకు అడ్డము రాకుము, నేను వారిని నశింపజేసి వారి నామమును ఆకాశము క్రింద నుండకుండ తుడుపుపెట్టి, నిన్ను వారికంటె బలముగల బహు జనముగా చేసెదనని నాతో చెప్పగా.
నేను తిరిగి ఆ కొండ దిగి వచ్చితిని. కొండ అగ్నిచేత కాలుచుండెను, ఆ రెండు నిబంధన పలకలు నా రెండు చేతులలో ఉండెను.
నేను చూచినప్పుడు మీరు మీ దేవుడైన యెహోవా దృష్టికి పాపము చేసియుంటిరి. పోతదూడను చేయించుకొని యెహోవా మీకాజ్ఞాపించిన త్రోవనుండి త్వరగా తొలగిపోయి యుంటిరి.
అప్పుడు నేను ఆ రెండు పలకలను పట్టుకొని, నా రెండు చేతులలోనుండి మీకన్నుల యెదుట వాటిని క్రిందపడవేసి పగులగొట్టి
మీరు యెహోవా దృష్టికి ఆ చెడునడత నడిచి చేసిన మీ సమస్త పాపముల వలన ఆయనకు కోపము పుట్టింపగా చూచి, మునుపటివలె అన్నపానములు మాని నలువది పగళ్లు నలువది రాత్రులు నేను యెహోవా సన్నిధిని సాగిలపడితిని.
వారు ఒక పోతదూడను చేసికొని ఐగుప్తులోనుండి మమ్మును రప్పించిన దేవుడు ఇదే అని చెప్పి, నీకు బహు విసుకు పుట్టించినను
ఇశ్రాయేలూ , అన్యజనులు సంతోషించునట్లు నీవు సంభ్రమపడి సంతోషింప వద్దు ; నీవు నీ దేవుని విసర్జించి వ్యభిచరించితివి , నీ కళ్లములన్నిటి మీదనున్న ధాన్యమును బట్టి నీవు పడుపుకూలిని ఆశించితివి .
అరణ్యములో ద్రాక్షపండ్లు దొరికినట్లు ఇశ్రాయేలువారు నాకు దొరికిరి ; చిగురుపెట్టు కాలమందు అంజూరపు చెట్టుమీద తొలి ఫలము దొరికినట్లు మీ పితరులు నాకు దొరికిరి . అయితే వారు బయల్పెయోరు నొద్దకు వచ్చి ఆ లజ్జాకరమైన దేవతకు తమ్మును తాము అప్పగించుకొనిరి ; తాము మోహించినదానివలెనే వారు హేయు లైరి .
చెక్కడపు పనివాడు విగ్రహమును చెక్కుటవలన ప్రయోజన మేమి ? పనివాడు మూగ బొమ్మను చేసి తాను రూపించిన దానియందు నమ్మిక యుంచుటవలన ప్రయోజన మేమి ? అబద్ధములు బోధించు పోతవిగ్రహములయందు నమ్మిక యుంచుటవలన ప్రయోజన మేమి ?
కఱ్ఱనుచూచి మేలుకొమ్మనియు , మూగ రాతిని చూచి లెమ్మనియు చెప్పువానికి శ్రమ ; అది ఏమైన బోధింపగలదా ? అది బంగారముతోను వెండితోను పూతపూయబడెను గాని దానిలో శ్వాసమెంత మాత్రమును లేదు .
అయితే యెహోవా తన పరిశు ద్ధాలయములో ఉన్నాడు, ఆయన సన్నిధిని లోకమంతయు మౌనముగా ఉండునుగాక .