all
అపొస్తలుల కార్యములు 16:20-22
20

అంతట న్యాయాధిపతులయొద్దకు వారిని తీసికొనివచ్చి ఈ మనుష్యులు యూదులైయుండి

21

రోమీయులమైన మనము అంగీకరించుటకైనను చేయుటకైనను కూడని ఆచారములు ప్రచురించుచు, మన పట్టణము గలిబిలి చేయుచున్నారని చెప్పిరి.

22

అప్పుడు జనసమూహము వారిమీదికి దొమి్మగా వచ్చెను. న్యాయాధిపతులును వారి వస్త్రములు లాగివేసి వారిని బెత్తములతో కొట్టవలెనని ఆజ్ఞాపించిరి.

అపొస్తలుల కార్యములు 19:29

పట్టణము బహు గలిబిలిగా ఉండెను. మరియు వారు పౌలుతో ప్రయాణమై వచ్చిన మాసిదోనియవారైన గాయియును అరిస్తర్కును పట్టుకొని దొమి్మగా నాటకశాలలో చొరబడిరి.

అపొస్తలుల కార్యములు 26:21

ఈ హేతువుచేత యూదులు దేవాలయములో నన్ను పట్టుకొని చంపుటకు ప్రయత్నముచేసిరి;

మత్తయి 2:3

హేరోదురాజు ఈ సంగతి విన్నప్పుడు అతడును అతనితో కూడ యెరూషలేము వారందరును కలవరపడిరి.

మత్తయి 21:10

ఆయన యెరూషలేము లోనికి వచ్చినప్పుడు పట్టణమంతయుఈయన ఎవరో అని కలవరపడెను.

and they
అపొస్తలుల కార్యములు 7:57

అప్పుడు వారు పెద్ద కేకలువేసి చెవులు మూసికొని యేకముగా అతనిమీదపడి

అపొస్తలుల కార్యములు 7:58

పట్టణపు వెలుపలికి అతనిని వెళ్లగొట్టి, రాళ్లు రువి్వ చంపిరి. సాక్షులు సౌలు అను ఒక ¸యవనుని పాదములయొద్ద తమ వస్త్రములు పెట్టిరి.

అపొస్తలుల కార్యములు 16:19

ఆమె యజమానులు తమ లాభసాధనము పోయెనని చూచి, పౌలును సీలను పట్టుకొని గ్రామపు చావడిలోనికి అధికారులయొద్దకు ఈడ్చుకొని పోయిరి.

లూకా 4:29

ఆగ్రహముతో నిండుకొని , లేచి ఆయనను పట్టణములో నుండి వెళ్లగొట్టి , ఆయనను తలక్రిందుగా పడద్రోయ వలెనని తమ పట్టణము కట్టబడిన కొండ పేటువరకు ఆయనను తీసికొని పోయిరి.

2 కొరింథీయులకు 11:26

అనేక పర్యాయములు ప్రయాణములలోను, నదులవలననైన ఆపదలలోను, దొంగలవలననైన ఆపదలలోను, నా స్వజనులవలననైన ఆపదలలోను, అన్యజనులవలననైన ఆపదలలోను, పట్టణములో ఆపదలోను, అరణ్యములో ఆపదలోను,సముద్రములో ఆపదలోను, కపట సహోదరులవలని ఆపదలలో ఉంటిని.