వారు బేత్లెహేమునకు వచ్చినప్పుడు ఆ ఊరి వారందరు వారియొద్దకు గుంపుకూడి వచ్చి ఈమె నయోమి గదా అని అనుకొనుచుండగా
ఆకీషు సేవకులు -ఈ దావీదు ఆ దేశపు రాజు కాడా ? వారు నాట్యమాడుచు గానప్రతిగానములు చేయుచు-సౌలు వేలకొలది హతముచేసెననియు , దావీదు పదివేలకొలది హతముచేసెననియు పాడిన పాటలు ఇతనిగూర్చినవే గదా అని అతనినిబట్టి రాజుతో మాటలాడగా
దరిద్రులను అధికారు లతో కూర్చుండబెట్టుటకును మహిమగల సింహాసనమును స్వతంత్రింపజేయుటకును వారిని మంటిలోనుండి యెత్తువాడు ఆయనే లేమిగలవారిని పెంటకుప్పమీదినుండి లేవనెత్తువాడు ఆయనే.భూమియొక్క స్తంభములు యెహోవా వశము,లోకమును వాటిమీద ఆయన నిలిపియున్నాడు .
వారు యెరికోపట్టణమునకు వచ్చిరి. ఆయన తన శిష్యులతోను బహు జనసమూహముతోను యెరికోనుండి బయలుదేరి వచ్చుచుండగా, తీమయి కుమారుడగు బర్తిమయియను గ్రుడ్డి భిక్షకుడు త్రోవప్రక్కను కూర్చుండెను.
లాజరు అను ఒక దరిద్రు డుండెను . వాడు కురుపులతో నిండినవాడై ధనవంతుని యింటి వాకిట పడియుండి
అతని బల్లమీద నుండి పడు రొట్టెముక్కలతో ఆకలి తీర్చుకొన గోరెను ; అంతేకాక కుక్కలు వచ్చి వాని కురుపులు నాకెను .
ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రాహాము రొమ్మున (ఆనుకొనుటకు) కొనిపోబడెను . ధనవంతుడు కూడ చనిపోయి పాతిపెట్టబడెను .
ఆయన యెరికో పట్టణమునకు సమీపించినప్పుడు ఒక గ్రుడ్డివాడు త్రోవప్రక్కను కూర్చుండి భిక్షమడుగుకొనుచుండెను.
పుట్టినది మొదలుకొని కుంటివాడైన యొక మనుష్యుడు మోసికొనిపోబడుచుండెను. వాడు దేవాలయములోనికి వెళ్లువారిని భిక్షమడుగుటకు కొందరు ప్రతిదినము వానిని శృంగారమను దేవాలయపు ద్వారమునొద్ద ఉంచుచు వచ్చిరి.
పేతురును యోహానును దేవాలయములో ప్రవేశింపబోవునప్పుడు వాడు చూచి భిక్షమడుగగా
పేతురును యోహానును వానిని తేరి చూచి మాతట్టు చూడుమనిరి.
వాడు వారియొద్ద ఏమైన దొరుకునని కనిపెట్టుచు వారియందు లక్ష్యముంచెను.
అంతట పేతురు వెండి బంగారములు నాయొద్ద లేవు గాని నాకు కలిగినదే నీకిచ్చుచున్నాను; నజరేయుడైన యేసు క్రీస్తు నామమున నడువుమని చెప్పి
వాని కుడిచెయ్యి పట్టుకొని లేవనెత్తెను; వెంటనే వాని పాదములును చీలమండలును బలముపొందెను.
వాడు దిగ్గున లేచి నిలిచి నడిచెను; నడుచుచు గంతులు వేయుచు దేవుని స్తుతించుచు వారితోకూడ దేవాలయములోనికి వెళ్లెను.
వాడు నడుచుచు దేవుని స్తుతించుట ప్రజలందరు చూచి
శృంగారమను దేవాలయపు ద్వారమునొద్ద భిక్షముకొరకు కూర్చుండినవాడు వీడే అని గుర్తెరిగి,వానికి జరిగినదానిని చూచి విస్మయముతో నిండి పరవశులైరి.
వాడు పేతురును యోహానును పట్టుకొనియుండగా, ప్రజలందరు విస్మయమొంది సొలొమోనుదను మంటపములో ఉన్న వారియొద్దకు గుంపుగా పరుగెత్తివచ్చిరి.