ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి యున్నది గనుక మంచి ఫలము ఫలించని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడునని చెప్పెను
లూకా 13:7

గనుక అతడు ఇదిగో మూడేండ్లనుండి నేను ఈ అంజూరపు చెట్టున పండ్లు వెదకవచ్చుచున్నాను గాని యేమియు దొరకలేదు; దీనిని నరికివేయుము, దీనివలన ఈ భూమియు ఏల వ్యర్థమై పోవలెనని ద్రాక్షతోట మాలితో చెప్పెను.

లూకా 13:9

అది ఫలించిన సరి, లేనియెడల నరికించివేయుమని అతనితో చెప్పెను.

లూకా 23:29-31
29

ఇదిగో గొడ్రాండ్రును కనని గర్భములును పాలియ్యని స్తనములును ధన్యములైనవని చెప్పుదినములు వచ్చుచున్నవి.

30

అప్పుడు మా మీద పడుడని పర్వతములతోను , మమ్ము కప్పుడని కొండలతోను జనులు చెప్ప సాగుదురు .

31

వారు పచ్చి మ్రానుకే యీలాగు చేసిన యెడల ఎండినదాని కేమి చేయుదురో అని చెప్పెను .

యెషయా 10:33

చూడుడి ప్రభువును సైన్యములకధిపతియునగు యెహోవా భీకరముగా కొమ్మలను తెగగొట్టగా మిక్కిలి యెత్తుగల చెట్లు నరకబడును ఉన్నతమైనవి పడిపోవును.

యెషయా 10:34

ఆయన అడవి పొదలను ఇనుపకత్తితో కొట్టివేయును లెబానోను బలవంతుడైన యొకనిచేత కూలిపోవును.

యెహెజ్కేలు 15:2-4
2

నరపుత్రుడా, ద్రాక్షచెట్టు కఱ్ఱ అడవిచెట్లలోనున్న ద్రాక్షచెట్టు కఱ్ఱ తక్కినచెట్ల కఱ్ఱకంటెను ఏమైన శ్రేష్ఠమా?

3

యే పనికైనను దాని కఱ్ఱను తీసికొందురా? యేయొక ఉపకరణము తగిలించుటకై యెవరైన దాని కఱ్ఱతో మేకునైనను చేయుదురా?

4

అది పొయ్యికే సరిపడును గదా? అగ్నిచేత దాని రెండు కొనలు కాల్చబడి నడుమ నల్లబడిన తరువాత అది మరి ఏ పనికైనను తగునా ?

యెహెజ్కేలు 31:18

కాబట్టి ఘనముగాను గొప్పగానున్న నీవు ఏదెను వనములోని వృక్షములలో దేనికి సముడవు ? నీవు పాతాళము లోనికి త్రోయబడి , ఘనులై అక్కడికి దిగిపోయిన రాజులయొద్ద ఉందువు; ఖడ్గముచేత హతులైన వారి యొద్దను సున్నతినొందనివారి యొద్దను నీవు పడియున్నావు . ఫరోకును అతని సమూహమునకును ఈలాగు సంభవించును; ఇదే ప్రభువగు యెహోవా వాక్కు .

దానియేలు 4:14

జాగరూకుడగు ఒక పరిశుద్ధుడు ఆకాశము నుండి దిగి వచ్చి ఈలాగు బిగ్గరగా ప్రకటించెను ఈ చెట్టును నరికి దాని కొమ్మలను కొట్టి దాని ఆకులను తీసివేసి దాని పండ్లను పారవేయుడి ; పశువులను దాని నీడనుండి తోలివేయుడి ; పక్షులను దాని కొమ్మల నుండి ఎగురగొట్టుడి.

దానియేలు 4:23

చెట్టును నరుకుము , దాని నాశనము చేయుము గాని దాని మొద్దును భూమిలో ఉండనిమ్ము ; ఇనుము ఇత్తిడి కలిసిన కట్టుతో ఏడు కాలములు గడచు వరకు పొలములోని పచ్చికలో దాని కట్టించి, ఆకాశపు మంచుకు తడవనిచ్చి పశువుల తో పాలుపొందనిమ్మని జాగరూకుడగు ఒక పరిశుద్ధుడు పరలోకము నుండి దిగివచ్చి ప్రకటించుట నీవు వింటివి గదా.

మత్తయి 3:10

ఇప్పుడే గొడ్డలి చెట్లవేరున ఉంచబడియున్నది గనుక మంచి ఫలము ఫలిం పని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడును.

మత్తయి 7:19

మంచి ఫలములు ఫలింపని ప్రతిచెట్టు నరకబడి అగ్నిలో వేయబడును.

యోహాను 15:6

ఎవడైనను నాయందు నిలిచియుండని యెడల వాడు తీగెవలె బయట పారవేయబడి యెండిపోవును; మనుష్యులు అట్టివాటిని పోగుచేసి అగ్నిలో పారవేతురు, అవి కాలిపోవును.

హెబ్రీయులకు 10:28

ఎవడైనను మోషే ధర్మశాస్త్రమును నిరాకరించినయెడల ఇద్దరు ముగ్గురు సాక్షుల మాటమీద, కనికరింపకుండ వాని చంపించుదురు.

హెబ్రీయులకు 12:29

ఏలయనగా మన దేవుడు దహించు అగ్నియైయున్నాడు.