జీవమునకు పోవు ద్వారము ఇరుకును ఆ దారి సంకుచితమునై యున్నది, దాని కనుగొనువారు కొందరే.
శిష్యులు ఈ మాట విని మిక్కిలి ఆశ్చర్యపడిఆలాగైతే ఎవడు రక్షణపొందగలడని అడుగగా
ఈ ప్రకారమే కడపటివారు మొదటి వారగుదురు, మొదటివారు కడపటివారగుదురు.
కాగా పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడినవారు కొందరే అని చెప్పెను.
ఆ జనసమూహములో ఒకడు బోధకుడా , పిత్రార్జితములో నాకు పాలుపంచిపెట్టవలెనని నా సహోదరునితో చెప్పుమని ఆయన నడుగగా
ఆయన ఓయీ , మీ మీద తీర్పరినిగానైనను పంచిపెట్టువానిగానైనను నన్నె వడు నియమించెనని అతనితో చెప్పెను .
మరియు ఆయన వారితో మీరు ఏవిధమైన లోభము నకు ఎడమియ్యక జాగ్రత్తపడుడి ; ఒకని కలిమి విస్తరించుట వాని జీవమునకు మూలము కాదనెను .
అప్పుడు వారు బోధకుడా, ఆలాగైతే ఇవి యెప్పుడు జరుగును? ఇవి జరుగబోవునని సూచన ఏమని ఆయన నడుగగా
ఆయన మీరు మోసపోకుండ చూచుకొనుడి. అనేకులు నా పేరట వచ్చి నేనే ఆయనననియు, కాలము సమీపించెననియు చెప్పుదురు; మీరు వారి వెంబడిపోకుడి.
ఆయన ఒలీవల కొండమీద కూర్చుండియున్నప్పుడు శిష్యులాయనయొద్దకు ఏకాంతముగా వచ్చిఇవి ఎప్పుడు జరుగును? నీ రాకడకును ఈ యుగసమాప్తికిని సూచనలేవి? మాతో చెప్పుమనగా
యేసు వారితో ఇట్లనెనుఎవడును మిమ్మును మోసపరచకుండ చూచుకొనుడి.
అనేకులు నా పేరట వచ్చినేనే క్రీస్తునని చెప్పి పలువురిని మోస పరచెదరు.
ఇవి ఎప్పుడు జరుగును? ఇవన్నియు నెరవేరబోవుకాలమునకు ఏ గురుతు కలుగును? అది మాతో చెప్పుమని ఆయనను ఏకాంత మందు అడుగగా
యేసు వారితో ఇట్లు చెప్పసాగెను ఎవడును మిమ్మును మోసపుచ్చకుండ చూచుకొనుడి.
పేతురు అతనిని చూచి ప్రభువా, యితని సంగతి ఏమగునని యేసును అడిగెను.
యేసు నేను వచ్చువరకు అతడుండుట నాకిష్టమైతే అది నీకేమి? నీవు నన్ను వెంబడించు మనెను.
కాలములను సమయములను తండ్రి తన స్వాధీనమందుంచుకొనియున్నాడు; వాటిని తెలిసికొనుట మీ పనికాదు.
అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చునప్పుడు మీరు శక్తినొందెదరు గనుక మీరు యెరూషలేములోను, యూదయ సమరయ దేశములయందంతటను భూదిగంతముల వరకును నాకు సాక్షులైయ౦దురని వారితొ చెప్పెను.