త్రోవలో ఎవని నైనను కుశలప్రశ్న లడుగ వద్దు; మీరు ఏ యింటనైనను ప్రవేశించునప్పుడుఈ యింటికి సమాధానమగు గాక అని మొదట చెప్పుడి
లూకా 19:9

అందుకు యేసు ఇతడును అబ్రాహాము కుమారుడే ; ఎందుకనగా నేడు ఈ యింటికి రక్షణ వచ్చియున్నది .

1 సమూయేలు 25:6

ఆ భాగ్యవంతునితో -నీకును నీ యింటికిని నీకు కలిగిన అంతటికిని క్షేమమవునుగాక అని పలికి యీ వర్తమానము తెలియజెప్పవలెను .

యెషయా 57:19

వారిలో కృతజ్ఞతాబుద్ధి పుట్టించుచు దూరస్థులకును సమీపస్థులకును సమాధానము సమాధానమని చెప్పి నేనే వారిని స్వస్థపరచెదనని యెహోవా సెలవిచ్చుచున్నాడు.

మత్తయి 10:12

ఆ యింటిలో ప్రవేశించుచు, ఇంటివారికి శుభమని చెప్పుడి.

మత్తయి 10:13

ఆ యిల్లు యోగ్యమైనదైతే మీ సమాధానము దానిమీదికి వచ్చును; అది అయోగ్యమైనదైతే మీ సమాధానము మీకు తిరిగి వచ్చును.

అపొస్తలుల కార్యములు 10:36

యేసుక్రీస్తు అందరికి ప్రభువు. ఆయనద్వారా దేవుడు సమాధానకరమైన సువార్తను ప్రకటించి ఇశ్రాయేలీయులకు పంపిన వర్తమానము మీరెరుగుదురు.

2 కొరింథీయులకు 5:18-20
18

సమస్తమును దేవుని వలననైనవి; ఆయన మనలను క్రీస్తుద్వారా తనతో సమాధానపరచుకొని, ఆ సమాధానపరచు పరిచర్యను మాకు అనుగ్రహించెను.

19

అదేమనగా, దేవుడు వారి అపరాధములను వారిమీద మోపక, క్రీస్తునందు లోకమును తనతో సమాధానపరచుకొనుచు, ఆ సమాధానవాక్యమును మాకు అప్పగించెను.

20

కావున దేవుడు మా ద్వారా వేడుకొనినట్టు మేము క్రీస్తుకు రాయబారులమై దేవునితో సమాధానపడుడని క్రీస్తు పక్షముగా మిమ్మును బతిమాలుకొనుచున్నాము.

ఎఫెసీయులకు 2:17

మరియు ఆయన వచ్చి దూరస్థులైన మీకును సమీపస్థులైన వారికిని సమాధాన సువార్తను ప్రకటించెను.