ఆయనను సిలువవేసినప్పుడు పగలు తొమి్మది గంటలాయెను.
మధ్యాహ్నము మొదలుకొని మూడు గంటలవరకు ఆ దేశమంతటను చీకటికమ్మెను.
అప్పుడు రమారమి మధ్యాహ్నమాయెను . అది మొదలుకొని మూడు గంటలవరకు ఆ దేశ మంతటి మీద చీకటి కమ్మెను ;
సూర్యుడు అదృశ్యుడాయెను ; గర్భాలయపు తెర నడిమికి చినిగెను .
ప్రభువైన యెహోవా సెలవిచ్చునదేమనగా -ఆ దినమున నేను మధ్యాహ్నకాలమందు సూర్యుని అస్తమింపజేయుదును . పగటివేళను భూమికి చీకటి కమ్మజేయుదును.
మీ పండుగ దినములను దుఃఖదినములుగాను మీ పాటలను ప్రలాపములుగాను మార్చుదును , అందరిని మొలల మీద గోనెపట్ట కట్టుకొనజేయుదును , అందరి తలలు బోడిచేసెదను , ఒకనికి కలుగు ఏకపుత్ర శోకము వంటి ప్రలాపము నేను పుట్టింతును ; దాని అంత్యదినము ఘోరమైన శ్రమ దినముగా ఉండును.