ప్రధానయాజకులును పెద్దలును ఆయనమీద నేరము మోపినప్పుడు ఆయన ప్రత్యుత్తరమేమియు ఇయ్యలేదు.
ఇతడు మా జనమును తిరుగబడ ప్రేరేపించుచు , కైసరునకు పన్ని య్య వద్దనియు , తానే క్రీస్తను ఒక రాజుననియు చెప్పగా మేము వింటిమని ఆయనమీద నేరము మోపసాగిరి .
పిలాతు నీవు యూదుల రాజువా అని ఆయనను అడుగగా ఆయన నీ వన్నట్టే అని అతనితో చెప్పెను .
పిలాతు ప్రధానయాజకుల తోను జనసమూహములతోను ఈ మనుష్యుని యందు నాకు ఏ నేరమును కనబడ లేదనెను .
అయితే వారు ఇతడు గలిలయదేశము మొదలుకొని ఇంతవరకును యూదయ దేశమందంతట ఉపదేశించుచు ప్రజలను రేపుచున్నాడని మరింత పట్టుదలగా చెప్పిరి .
కావున పిలాతు బయట ఉన్నవారియొద్దకు వచ్చి ఈ మనుష్యునిమీద మీరు ఏ నేరము మోపుచున్నారనెను.
అందుకు వారు వీడు దుర్మార్గుడు కాని యెడల వీనిని నీకు అప్పగించియుండమని అతనితో చెప్పిరి.
పిలాతుమీరతని తీసికొనిపోయి మీ ధర్మశాస్త్రముచొప్పున అతనికి తీర్పుతీర్చుడనగా
ప్రధాన యాజకులును బంట్రౌతులును ఆయనను చూచి సిలువవేయుము సిలువవేయుము అని కేకలువేయగా పిలాతు ఆయనయందు ఏ దోషమును నాకు కనబడలేదు గనుక మీరే ఆయనను తీసికొనిపోయి సిలువవేయుడని వారితో చెప్పెను.
అందుకు యూదులు మాకొక నియమము కలదు; తాను దేవుని కుమారుడనని ఇతడు చెప్పుకొనెను గనుక ఆ నియమము చొప్పున ఇతడు చావవలెనని అతనితో చెప్పిరి.
ఈ మాటనుబట్టి పిలాతు ఆయనను విడుదల చేయుటకు యత్నముచేసెను గాని యూదులునీవు ఇతని విడుదల చేసితివా కైసరునకు స్నేహితుడవు కావు; తాను రాజునని చెప్పుకొను ప్రతివాడును కైసరునకు విరోధముగా మాటలాడుచున్నవాడే అని కేకలువేసిరి.
అయినను యేసు మరి ఏ ఉత్తరము చెప్పలేదు గనుక పిలాతు ఆశ్చర్య పడెను.
ప్రధానయాజకుడు వారి మధ్యను లేచి నిలిచిఉత్తరమేమియు చెప్పవా? వీరు నీ మీద పలుకుచున్న సాక్ష్యమేమని యేసు నడిగెను.
అయితే ఆయన ఉత్తరమేమియు చెప్పక ఊరకుండెను. తిరిగి ప్రధాన యాజకుడుపరమాత్ముని కుమారుడవైన క్రీస్తువు నీవేనా? అని ఆయన నడుగగా