ఆయన వారిని వీడుకొలిపి, ప్రార్థనచేయుటకు కొండకు వెళ్లెను.
సాయంకాలమైనప్పుడు ఆ దోనె సముద్రము మధ్య ఉండెను ఆయన ఒంటరిగా మెట్ట నుండెను.
అప్పుడు వారికి గాలి ఎదురైనందున, దోనె నడిపించుటలో వారు మిక్కిలి కష్టపడుచుండగా ఆయన చూచి, రాత్రి ఇంచు మించు నాలుగవ జామున సముద్రముమీద నడుచుచు వారియొద్దకు వచ్చి, వారిని దాటిపోవలెనని యుండెను
యెహోవా, ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడును ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధముచేసి కాచియుందును.
ఉదయ మైనప్పుడు ఆయన బయలుదేరి అరణ్య ప్రదేశ మునకు వెళ్లెను . జనసమూహము ఆయనను వెదకుచు ఆయన యొద్దకు వచ్చి , తమ్మును విడిచి పోకుండ ఆపగా
ఆ దినములయందు ఆయన ప్రార్థనచేయుటకు కొండకు వెళ్లి, దేవుని ప్రార్థించుటయందు రాత్రి గడిపెను.
తరువాత ఆయన బయలుదేరి, తన వాడుక చొప్పున ఒలీవలకొండకు వెళ్లగా శిష్యులును ఆయనవెంట వెళ్లిరి.
ఆ చోటు చేరి ఆయన వారితో మీరు శోధనలో ప్రవే శించకుండునట్లు ప్రార్థనచేయుడని చెప్పి
వారియొద్ద నుండి రాతివేత దూరము వెళ్లి మోకాళ్లూని
తండ్రీ , యీ గిన్నె నా యొద్దనుండి (తొలగించుటకు) నీ చిత మైతే తొలగించుము ; అయినను నా యిష్టము కాదు , నీ చిత్తమే సిద్ధించునుగాక అని ప్రార్థించెను .
అప్పుడు పరలోకము నుండి యొకదూత ఆయనకు కనబడి ఆయనను బలపరచెను .
ఆయన వేదన పడి మరింత ఆతురముగా ప్రార్థన చేయగా ఆయన చెమట , నేల పడుచున్న గొప్ప రక్త బిందువుల వలె ఆయెను .
ఆయన ప్రార్థన చాలించి లేచి తన శిష్యుల యొద్దకు వచ్చి , వారు దుఃఖము చేత నిద్రించుట చూచి
మీరెందుకు నిద్రించుచున్నారు ? శోధన లో ప్రవేశించ కుండునట్లు లేచి ప్రార్థన చేయుడని వారితో చెప్పెను.
యేసు వారిని చూచినన్ను పంపినవాని చిత్తము నెరవేర్చుటయు, ఆయన పని తుదముట్టించుటయు నాకు ఆహారమై యున్నది.
రాజుగా చేయుటకు వారు వచ్చి తన్ను బలవంతముగా పట్టుకొనబోవుచున్నారని యేసు ఎరిగి, మరల కొండకు ఒంటరిగా వెళ్లెను.
ఆత్మవలన ప్రతి సమయమునందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయుచు, ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపనచేయుచు మెలకువగా ఉండుడి.
క్రీస్తుయేసునకు కలిగిన యీ మనస్సు మీరును కలిగియుండుడి.
శరీరధారియై యున్న దినములలో మహా రోదనముతోను కన్నీళ్లతోను, తన్ను మరణమునుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి,భయభక్తులు కలిగి యున్నందున ఆయన అంగీకరింపబడెను.