జ్ఞాపకము తెచ్చుకొని
మత్తయి 26:34

యేసు అతని చూచి–ఈ రాత్రి కోడి కూయక మునుపే నీవు నన్ను ఎరుగనని ముమ్మారు చెప్పెదవని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాననెను.

లూకా 22:61

అప్పుడు ప్రభువు తిరిగి పేతురువైపు చూచెను గనుక పేతురు–నేడు కోడి కూయకమునుపు నీవు ముమ్మారు నన్ను ఎరుగనందువని ప్రభువు తనతో చెప్పిన మాట జ్ఞాపకముచేసుకొని,

లూకా 22:62

వెలుపలికిపోయి సంతాపపడి యేడ్చెను.

యోహాను 13:38

యేసునాకొరకు నీ ప్రాణము పెట్టుదువా? ఆయనను ఎరుగనని నీవు ముమ్మారు చెప్పకముందు కోడికూయదని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాననెను.

వెలుపలికి పోయి
మత్తయి 27:3-5
3

అప్పుడాయనను అప్పగించిన యూదా, ఆయనకు శిక్ష విధింపబడగా చూచి పశ్చాత్తాపపడి, ఆ ముప్పది వెండి నాణములు ప్రధానయాజకులయొద్దకును పెద్దలయొద్దకును మరల తెచ్చి

4

–నేను నిరపరాధరక్తమును అప్పగించి పాపము చేసితినని చెప్పెను. వారు–దానితో మాకేమి? నీవే చూచుకొనుమని చెప్పగా

5

అతడు ఆ వెండి నాణెములు దేవాలయములో పారవేసి, పోయి ఉరిపెట్టు కొనెను.

లూకా 22:31-34
31

సీమోనూ, సీమోనూ, ఇదిగో సాతాను మిమ్మును పట్టి గోధుమలవలె జల్లించుటకు మిమ్మును కోరుకొనెను గాని

32

నీ నమ్మిక తప్పిపోకుండునట్లు నేను నీకొరకు వేడుకొంటిని; నీ మనసు తిరిగిన తరువాత నీ సహోదరులను స్థిరపరచుమని చెప్పెను.

33

అయితే అతడు–ప్రభువా, నీతోకూడ చెరలోనికిని మరణమునకును వెళ్లుటకు సిద్ధముగా ఉన్నానని ఆయనతో అనగా

34

ఆయన–పేతురూ, నీవు నన్నెరుగనని ముమ్మారు చెప్పు వరకు, నేడు కోడికూయదని నీతో చెప్పుచున్నాననెను.

రోమీయులకు 7:18-20
18

నా యందు , అనగా నా శరీర మందు మంచిది ఏదియు నివసింపదని నేనెరుగుదును . మేలైనది చేయవలెనను కోరిక నాకు కలుగుచున్నది గాని , దానిని చేయుట నాకు కలుగుట లేదు .

19

నేను చేయగోరు మేలు చేయక చేయగోరని కీడు చేయుచున్నాను .

20

నేను కోరని దానిని చేసిన యెడల , దానిని చేయునది నా యందు నివసించు పాపమే గాని యికను నేను కాదు .

1 కొరింథీయులకు 4:7

ఎందుకనగా నీకు ఆధిక్యము కలుగజేయువాడెవడు? నీకు కలిగిన వాటిలో పరునివలన నీవు పొందనిది ఏది?పొందియుండియు పొందనట్టు నీవు అతిశయింపనేల?

గలతీయులకు 6:1

సహోదరులారా, ఒకడు ఏ తప్పితములోనైనను చిక్కుకొనినయెడల ఆత్మసంబంధులైన మీలో ప్రతివాడు తానును శోధింపబడుదునేమో అని తన విషయమై చూచుకొనుచు, సాత్వికమైన మనస్సుతో అట్టివానిని మంచిదారికి తీసికొనిరావలెను.

1 పేతురు 1:5

కడవరి కాలమందు బయలుపరచబడుటకు సిద్ధముగానున్న రక్షణ మీకు కలుగునట్లు, విశ్వాసముద్వారా దేవుని శక్తిచేత కాపాడబడు మీకొరకు, ఆ స్వాస్థ్యము పరలోకమందు భద్రపరచబడియున్నది.