మీ ద్రాక్షపండ్ల కాలమువరకు మీ నూర్పు సాగుచుండును, మీరు తృప్తిగా మీ దేశములో నిర్భయముగా నివసించెదరు.
పాడైన భూమి ఏదెను వనమువలె ఆయెననియు , పాడుగాను నిర్జనముగానున్న యీ పట్టణములు నివాసులతో నిండి ప్రాకారములు గలవాయెననియు జనులు చెప్పుదురు .
ఆ దినమున నేను మనవి ఆలకింతును ; ఆకాశపు మనవి నేను ఆలకింపగా అది భూమియొక్క మనవి ఆలకించును ;
భూమి ధాన్య ద్రాక్షారస తైలముల మనవి ఆలకింపగా అవి యెజ్రెయేలు చేయు మనవి ఆలకించును .
నేను దానిని భూమియందు నాకొరకై విత్తుదును ; జాలి నొందని దానియందు నేను జాలిచేసి కొందును; నా జనము కానివారితో -మీరే నా జనమని నేను చెప్పగా వారు నీవే మా దేవుడవు అని యందురు ; ఇదే యెహోవా వాక్కు .
ఇంక నాలుగు నెలలైన తరువాత కోతకాలము వచ్చునని మీరు చెప్పుదురు గదా. ఇదిగో మీ కన్నులెత్తి పొలములను చూడుడి; అవి ఇప్పుడే తెల్లబారి కోతకు వచ్చియున్నవని మీతో చెప్పుచున్నాను.
అరణ్యమును ఎండిన భూమియు సంతోషించును అడవి ఉల్లసించి కస్తూరిపుష్పమువలె పూయును
అది బహుగా పూయుచు ఉల్లసించును ఉల్లసించి సంగీతములు పాడును లెబానోను సౌందర్యము దానికి కలుగును కర్మెలు షారోనులకున్న సొగసు దానికుండును అవి యెహోవా మహిమను మన దేవుని తేజస్సును చూచును .
ముండ్లచెట్లకు బదులుగా దేవదారువృక్షములు మొలుచును దురదగొండిచెట్లకు బదులుగా గొంజివృక్షములు ఎదుగును అది యెహోవాకు ఖ్యాతిగాను ఆయనకు కొట్టివేయ బడని నిత్యమైన జ్ఞాపక సూచన గాను ఉండును .
ఆ దినమందు పర్వతములలోనుండి క్రొత్త ద్రాక్షారసము పారును , కొండలలోనుండి పాలు ప్రవహించును . యూదా నదు లన్నిటిలో నీళ్లు పారును , నీటి ఊట యెహోవా మందిరము లోనుండి ఉబికి షిత్తీము లోయను తడుపును .
ఈలాగున నేను ఇంతకుముందు ప్రతికారము చేయని ప్రాణదోషమునకై ప్రతికారము చేయుదును .
ఆయన సైన్యములకధిపతియగు యెహోవా ; ఆయన భూమిని మొత్తగా అది కరిగిపోవును , అందులోని నివాసు లందరును ప్రలాపింతురు , నైలునదివలెనే అదియంతయు ఉబుకుచుండును , ఐగుప్తుదేశపు నైలునదివలెనే అది అణగిపోవును .
యెహోవా సన్నిధిని కొండలలోనుండి ప్రవాహములు వచ్చెను ఇశ్రాయేలు దేవుడైన యెహోవాసన్నిధిని సీనాయిలోనుండి ప్రవాహములు వచ్చెను.
యెహోవా సన్నిధిని సర్వలోకనాధుని సన్నిధిని పర్వతములు మైనమువలె కరగుచున్నవి .