ఆ కోడెను పాళెము వెలుపలికి మోసికొనిపోయి ఆ మొదటి కోడెను కాల్చినట్లు కాల్చవలెను. ఇది సంఘమునకు పాపపరిహారార్థబలి.
మరియు పాపపరిహారార్థబలిగా తేబడిన యే పశువు రక్తములో కొంచెమైనను అతిపరిశుద్ధస్థలములో ప్రాయశ్చిత్తము చేయుటకై ప్రత్యక్షపు గుడారములోనికి తేబడునో ఆ బలిపశువును తినవలదు, దానిని అగ్నిలో కాల్చివేయవలెను.
ఇట్లు యెహోవా మోషేకు ఆజ్ఞాపించెను. అప్పుడతడు పాపపరిహారార్థబలిగా ఒక కోడెను తీసికొనివచ్చెను. అహరోనును అతని కుమారులును పాపపరిహారార్థబలిరూపమైన ఆ కోడె తలమీద తమ చేతులుంచిరి.
దాని వధించిన తరువాత మోషే దాని రక్తమును తీసి బలిపీఠపుకొమ్ములచుట్టు వ్రేలితో దాని చమిరి బలిపీఠము విషయమై పాపపరిహారముచేసి దాని నిమిత్తము ప్రాయశ్చిత్తముచేయుటకై బలిపీఠము అడుగున రక్తమును పోసి దాని ప్రతిష్ఠించెను.
మోషే ఆంత్రములమీది క్రొవ్వంతటిని కాలేజముమీది వపను రెండు మూత్రగ్రంథులను వాటి క్రొవ్వును తీసి బలిపీఠముమీద దహించెను.
మరియు యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు ఆ కోడెను దాని చర్మమును దాని మాంసమును దాని పేడను పాళెమునకు అవతల అగ్నిచేత కాల్చివేసెను.
కాబట్టి అహరోను బలిపీఠము దగ్గరకు వెళ్లి తనకొరకు పాపపరిహారార్థ బలిగా ఒక దూడను వధించెను.
అహరోను కుమారులు దాని రక్తమును అతనియొద్దకు తేగా అతడు ఆ రక్తములో తన వ్రేలు ముంచి బలిపీఠపు కొమ్ములమీద దాని చమిరి బలిపీఠము అడుగున ఆ రక్తమును పోసెను.
దాని క్రొవ్వును మూత్రగ్రంథులను కాలేజముమీది వపను బలిపీఠముమీద దహించెను. అట్లు యెహోవా మోషేకు ఆజ్ఞాపించెను.
దాని మాంసమును చర్మమును పాళెము వెలుపల అగ్నితో కాల్చివేసెను.
పరిశుద్ధస్థలములో ప్రాయశ్చిత్తము చేయుటకు వేటి రక్తము దాని లోపలికి తేబడెనో పాపపరిహారార్థబలియగు ఆ కోడెను ఆ మేకను ఒకడు పాళెము వెలుపలికి తీసికొనిపోవలెను. వాటి చర్మములను వాటి మాంసమును వాటి మలమును అగ్నితో కాల్చివేయవలెను.
ఆ కోడె మాంసమును దాని చర్మమును దాని పేడను పాళెమునకు వెలుపల అగ్నితో కాల్చవలెను, అది పాపపరిహారార్థమైన బలి.
అతని కన్నుల ఎదుట ఒకడు ఆ పెయ్యను, దహింపవలెను. దాని చర్మమును మాంసమును రక్తమును పేడయును దహింపవలెను.
పడమటికి తూర్పు ఎంత దూరమో ఆయన మన అతిక్రమములను మనకు అంత దూరపరచియున్నాడు .
వేటిరక్తము పాపపరిహారార్థముగ పరిశుద్ధస్థలములోనికి ప్రధానయాజకుని చేత తేబడునో, ఆ జంతువుల కళేబరములు శిబిరమునకు వెలుపట దహింపబడును.
కావున యేసుకూడ తన స్వరక్తముచేత ప్రజలను పరిశుద్ధపరచుటకై గవిని వెలుపట శ్రమపొందెను.
కాబట్టి మనమాయన నిందను భరించుచు శిబిరము వెలుపలికి ఆయనయొద్దకు వెళ్లుదము.