వాడు కృతజ్ఞతార్పణముగా దాని నర్పించునప్పుడు తన కృతజ్ఞతార్పణ రూపమైన బలి గాక నూనెతో కలిసినవియు పొంగనివియునైన పిండి వంటలను, నూనె పూసినవియు పొంగనివియునైన పలచని అప్పడములను, నూనె కలిపి కాల్చిన గోధుమపిండి వంటలను అర్పింపవలెను.
ఆ పిండివంటలేకాక సమాధానబలిరూపమైన కృతజ్ఞతాబలి ద్రవ్యములో పులిసిన రొట్టెను అర్పణముగా అర్పింపవలెను.
మరియు ఆ అర్పణములలో ప్రతిదానిలోనుండి ఒకదాని యెహోవాకు ప్రతిష్ఠార్పణముగా అర్పింపవలెను. అది సమాధానబలిపశురక్తమును ప్రోక్షించిన యాజకునిది, అది అతనిదగును.
సమాధానబలిగా తాను అర్పించు కృతజ్ఞతాబలి పశువును అర్పించు దినమే దాని మాంసమును తినవలెను; దానిలోనిది ఏదియు మరునాటికి ఉంచుకొనకూడదు.
మాటలు సిద్ధపరచుకొని యెహోవా యొద్దకు తిరుగుడి ; మీరు ఆయనతో చెప్పవలసినదేమనగా -మా పాపము లన్నిటిని పరిహరింపుము ; ఎడ్లకు బదులుగా నీకు మా పెదవుల నర్పించుచున్నాము ; నీవంగీకరింపదగినవి అవే మాకున్నవి.
పులిసిన పిండితో స్తోత్రార్పణ అర్పించుడి , స్వేచ్చార్పణను గూర్చి చాటించి ప్రకటన చేయుడి; ఇశ్రాయే లీయులారా , యీలాగున చేయుట మీకిష్టమైయున్నది ; ఇదే ప్రభువైన యెహోవా వాక్కు .
కాబట్టి ఆయనద్వారా మనము దేవునికి ఎల్లప్పుడును స్తుతియాగము చేయుదము, అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు, జిహ్వాఫలము అర్పించుదము.
యేసుక్రీస్తుద్వారా దేవునికి అనుకూలములగు ఆత్మసంబంధమైన బలులనర్పించుటకు పరిశుద్ధయాజకులుగా ఉండునట్లు, మీరును సజీవమైన రాళ్లవలెనుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు.