
వారికి నా కట్టడలను నియమించి నా విధులను వారికి తెలియజేసితిని . ఎవడైన వాటి ననుసరించినయెడల వాటినిబట్టి బ్రదుకును .
అయితే అరణ్యమందు ఇశ్రాయేలీయులు నామీద తిరుగుబాటు చేసి నా కట్టడల ననుస రింపక , తాము అనుసరించి బ్రదుకవలెనని నేనిచ్చిన విధులను తృణీకరించి , నేను నియమించిన విశ్రాంతిదినములను అపవిత్రపరచగా , అరణ్యమందు నా రౌద్రాగ్ని వారిమీద కుమ్మరించి వారిని నిర్మూలము చేయుదుననుకొంటిని .
అయినను ఆ జనులు సహా నా మీద తిరుగబడి , తామనుసరించి బ్రదుకవలెనని నేనిచ్చిన నా కట్టడలను అనుస రింపకయు , నా విధులను గైకొన కయు , నేను నియమించిన విశ్రాంతిదినములను అపవిత్రపరచిరి గనుక, వారు అరణ్యములో ఉండగానే నేను నా రౌద్రాగ్ని వారిమీద కుమ్మరించి నా కోపము వారిమీద తీర్చుకొందునని యనుకొంటిని .
అందుకాయన–నీవు సరిగా ఉత్తరమిచ్చితివి ; ఆలాగు చేయుము అప్పుడు జీవించెదవని అతనితో చెప్పెను .
ధర్మశాస్త్ర మూలమగు నీతిని నెరవేర్చు వాడు దాని వలననే జీవించునని మోషే వ్రాయుచున్నాడు .
ధర్మశాస్త్రము విశ్వాససంబంధమైనది కాదు గాని దాని విధులను ఆచరించువాడు వాటివలననే జీవించును.
మరియు దేవుడు మోషేతో ఇట్లనెను–నేనే యెహోవాను;
కాబట్టి నీవు ఇశ్రాయేలీయులతో ఈలాగు చెప్పుము–నేనే యెహోవాను; నేను ఐగుప్తీయులు మోయించు బరువుల క్రింద నుండి మిమ్మును వెలుపలికి రప్పించి, వారి దాసత్వములోనుండి మిమ్మును విడిపించి, నా బాహువు చాపి గొప్ప తీర్పులుతీర్చి మిమ్మును విడిపించి,
యెహోవా–నేను యెహోవాను; నేను నీతో చెప్పునది యావత్తు నీవు ఐగుప్తు రాజైన ఫరోతో పలుకుమని మోషేతో చెప్పగా
యెహోవానైన నేను మార్పు లేనివాడను గనుక యాకోబు సంతతివారైన మీరు లయము కాలేదు .