మాదీయుడగు దర్యావేషు అరువది రెండు సంవత్సరముల వాడై సింహాసనము నెక్కెను .
ఈ దానియేలు దర్యావేషు ప్రభుత్వకాలమందును పారసీకుడగు కోరెషు ప్రభుత్వకాలమందును వర్థిల్లెను .
నేను ఊలయియను నది ప్రక్కను ఉన్నట్టు నాకు దర్శనము కలిగెను . నేను కన్ను లెత్తి చూడగా , ఒక పొట్టేలు ఆ నది ప్రక్కను నిలిచియుండెను ; దానికి రెండు కొమ్ములు , ఆ కొమ్ములు ఎత్తయినవి గాని యొకటి రెండవ దానికంటె ఎత్తుగా ఉండెను; ఎత్తుగలది దానికి తరువాత మొలిచినది .
ఆ పొట్టేలు కొమ్ముతో పశ్చిమముగాను ఉత్తరముగాను దక్షిణముగాను పొడుచుచుండుట చూచితిని . ఇట్లు జరుగగా దానిని ఎదిరించుటకైనను , అది పట్టకుండ తప్పించుకొనుటకైనను , ఏ జంతువునకును శక్తిలేకపోయెను ; అది తనకిష్టమైనట్టుగా జరిగించుచు బలము చూపుచు వచ్చెను.
నీవు చూచిన రెండు కొమ్ములు గల ఆ పొట్టేలున్నదే , అది మాదీయులయొక్కయు పారసీకులయొక్కయు రాజులను సూచించుచున్నది.
మాదీయుడగు అహష్వేరోషుయొక్క కుమారుడైన దర్యావేషు కల్దీయుల పైన రాజాయెను .