అతని కుమారులు యుద్ధము చేయబూని మహా సైన్యముల సమూహమును సమకూర్చుకొందురు . అతడు వచ్చి యేరువలె ప్రవహించి ఉప్పొంగును ; యుద్ధము చేయబూని కోటదనుక వచ్చును.
ఈ అరువది రెండు వారములు జరిగిన పిమ్మట ఏమియు లేకుండ అభిషిక్తుడు నిర్మూలము చేయబడును. వచ్చునట్టి రాజు యొక్క ప్రజలు పవిత్ర పట్టణమును పరిశుద్ధ ఆలయమును నశింపజేయుదురు , వాని అంతము హఠాత్తుగా వచ్చును. మరియు యుద్ధ కాలాంతము వరకు నాశనము జరుగునని నిర్ణయింపబడెను .
ఇందును గూర్చి భూమి కంపించదా ? దాని నివాసు లందరును అంగలార్చరా ? నైలునది పొంగునట్లు భూమి అంతయు ఉబుకును, ఐగుప్తుదేశపు నైలునదివలె అది ఉబుకును , మిస్రయీము దేశపునదివలె అది అణగిపోవును .
ఆయన సైన్యములకధిపతియగు యెహోవా ; ఆయన భూమిని మొత్తగా అది కరిగిపోవును , అందులోని నివాసు లందరును ప్రలాపింతురు , నైలునదివలెనే అదియంతయు ఉబుకుచుండును , ఐగుప్తుదేశపు నైలునదివలెనే అది అణగిపోవును .
ప్రళయ జలమువలె ఆయన ఆ పురస్థానమును నిర్మూలముచేయును, తన శత్రువులు అంధకారములో దిగువరకు ఆయన వారిని తరుమును,
కావున ఆ స్త్రీ, ప్రవాహమునకు కొట్టుకొనిపోవలెనని ఆ సర్పము తన నోటినుండి నీళ్లు నదీప్రవాహముగా ఆమె వెనుక వెళ్లగ్రక్కెనుగాని
భూమి ఆ స్త్రీకి సహకారియై తన నోరు తెరచి ఆ ఘటసర్పము, తన నోటనుండి గ్రక్కిన ప్రవాహమును మింగివేసెను.
ఆకాశ సైన్యము నంటునంతగా పెరిగి నక్షత్రములలో కొన్నిటిని పడవేసి కాళ్లక్రింద అణగద్రొక్కుచుండెను
ఆ సైన్యముయొక్క అధిపతికి విరోధముగా తన్ను హెచ్చించుకొని , అనుదిన బల్యర్పణమును నిలిపివేసి ఆయన ఆలయమును పడద్రోసెను .
మరియు నతడు ఉపాయము కలిగినవాడై మోసము చేసి తనకు లాభము తెచ్చుకొనును; అతడు అతిశయపడి తన్నుతాను హెచ్చించుకొనును; క్షేమముగానున్న కాలమందు అనేకులను సంహరించును ; అతడు రాజాధి రాజు తో యుద్ధముచేయును గాని కడపట అతని బలము దైవాధీనమువలన కొట్టివేయబడును .