ప్రవాహమువంటి బలము అతని యెదుటనుండి వారిని కొట్టుకొని పోవుటవలన వారు నాశనమగుదురు ; సంధి చేసిన అధిపతి సహా నాశనమగును.
అంత్య కాలమందు దక్షిణదేశపు రాజు అతనితో యుద్ధముచేయును . మరియు ఉత్తరదేశపు రాజు రథములను గుఱ్ఱపురౌతులను అనేకమైన ఓడలను సమకూర్చుకొని, తుపానువలె అతనిమీద పడి దేశముల మీదుగా ప్రవాహమువలె వెళ్లును .
ఈ అరువది రెండు వారములు జరిగిన పిమ్మట ఏమియు లేకుండ అభిషిక్తుడు నిర్మూలము చేయబడును. వచ్చునట్టి రాజు యొక్క ప్రజలు పవిత్ర పట్టణమును పరిశుద్ధ ఆలయమును నశింపజేయుదురు , వాని అంతము హఠాత్తుగా వచ్చును. మరియు యుద్ధ కాలాంతము వరకు నాశనము జరుగునని నిర్ణయింపబడెను .
కాగా ప్రభువు బలమైన యూఫ్రటీసునది విస్తార జలములను, అనగా అష్షూరు రాజును అతని దండంతటిని వారిమీదికి రప్పించును; అవి దాని కాలువలన్నిటిపైగా పొంగి ఒడ్డులన్నిటిమీదను పొర్లి పారును.
అవి యూదా దేశములోనికి వచ్చి పొర్లి ప్రవహించును; అవి కుతికల లోతగును. ఇమ్మానుయేలూ, పక్షి తన రెక్కలు విప్పునప్పటివలె దాని రెక్కల వ్యాపకము నీ దేశ వైశాల్యమంతటను వ్యాపించును.
నైలునదీప్రవాహమువలె వచ్చు నితడెవడు? ఇతని జలములు నదులవలె ప్రవహించుచున్నవి
ఐగుప్తీయుల దండు నైలునదివలె ప్రవహించుచున్నది. దాని జలములు తొణకునట్లుగా అది వచ్చుచున్నది.నేనెక్కి భూమిని కప్పెదనుపట్టణమును దాని నివాసులను నాశనము చేసెదను.
సముద్రము బబులోనుమీదికి వచ్చెను ఆమె దాని తరంగములధ్వనితో నిండుకొనెను.
అతనికి బదులుగా ఆమె వంశములో ఒకడు సేనకు అధిపతియై ఉత్తరదేశపు రాజు కోటలో జొరబడి యిష్టానుసారముగా జరిగించుచు వారిని గెలుచును
మరియు ఈ క్రొత్త దేవతను ఆధారముచేసికొని , కోటలకు ప్రాకారములు కట్టించి , నూతన విధముగా తనవారికి మహా ఘనత కలుగజేయును; దేశమును క్రయమునకు విభజించి యిచ్చి అనేకులమీద తనవారికి ప్రభుత్వ మిచ్చును.
మోయాబూ, నీ ప్రాకారముల పొడవైన కోటలను ఆయన క్రుంగగొట్టును వాటిని నేలకు అణగద్రొక్కి ధూళిపాలుచేయును.