తెల్లవారినప్పుడు ఆ దూతలు లోతును త్వరపెట్టిలెమ్ము; ఈ ఊరి దోషశిక్షలో నశించిపోకుండ నీ భార్యను ఇక్కడనున్న నీ యిద్దరు కుమార్తెలను తీసికొని రమ్మని చెప్పిరి.
అప్పుడు యెహోవా సొదొమమీదను గొమొఱ్ఱామీదను యెహోవాయొద్ద నుండి గంధకమును అగ్నిని ఆకాశమునుండి కురిపించి
పర్వతములను నిరూపించువాడును గాలిని పుట్టించువాడును ఆయనే. ఉదయమున చీకటి కమ్మజేయువాడును మనుష్యుల యోచనలు వారికి తెలియజేయువాడును ఆయనే; భూమియొక్క ఉన్నతస్థలము మీద సంచరించు దేవుడును సైన్యములకు అధిపతియునగు యెహోవా అని ఆయనకు పేరు .
కాలము వచ్చుచున్నది , దినము సమీపమాయెను , వారి సమూహ మంతటి మీద ఉగ్రత నిలిచి యున్నది గనుక కొనువారికి సంతోషముండ పనిలేదు , అమ్మువానికి దుఃఖముండ పనిలేదు .
కావున నీవు వారికి ఈ మాట తెలియజేయుము ప్రభువగు యెహోవా సెలవిచ్చునదేమనగా ఇకమీదట ఇశ్రాయేలీయులలో ఎవరును ఈ సామెత పలుకకుండ నేను దానిని నిరర్థకము చేసెదను గనుక నీవు వారితో ఇట్లనుము దినములు వచ్చుచున్నవి, ప్రతిదర్శనము నెరవేరును
వ్యర్థమైన దర్శనమైనను ఇచ్చకములాడు సోదెగాండ్ర మాటలైనను ఇశ్రాయేలీయులలో ఇకను ఉండవు.
యెహోవానైన నేను మాటయిచ్చుచున్నాను, నే నిచ్చు మాట యికను ఆలస్యములేక జరుగును. తిరుగుబాటు చేయువారలారా, మీ దినములలో నేను మాటయిచ్చి దాని నెరవేర్చెదను, ఇదే ప్రభువగు యెహోవా వాక్కు.
యెహోవా మహా దినము సమీపమాయెను, యెహోవా దినము సమీపమై అతి శీఘ్రముగా వచ్చుచున్నది. ఆలకించుడి, యెహోవా దినము వచ్చుచున్నది, పరాక్రమశాలురు మహారోదనము చేయుదురు.
ఆ దినము ఉగ్రతదినము, శ్రమయు ఉప ద్రవమును మహానాశనమును కమ్ముదినము, అంధకారమును గాఢాంధకారమును కమ్ముదినము, మేఘములును గాఢాంధ కారమును కమ్ముదినము.
ఆ దినమున ప్రాకారములుగల పట్టణముల దగ్గరను, ఎత్తయిన గోపురముల దగ్గరను యుద్ధ ఘోషణయు బాకానాదమును వినబడును.
తీర్పు దేవుని ఇంటియొద్ద ఆరంభమగు కాలము వచ్చి యున్నది; అది మనయొద్దనే ఆరంభమైతే దేవుని సువార్తకు అవిధేయులైన వారి గతియేమవును?
యెహోవా, నీవు నన్ను ప్రేరేపింపగా నీ ప్రేరే పణకు లోబడితిని; నీవు బలవంతముచేసి నన్ను గెలిచితివి, నేను దినమెల్ల నవ్వులపాలైతిని, అందరు నన్ను ఎగతాళి చేయుదురు.