
నర పుత్రుడా , పెంకు ఒకటి తీసికొనివచ్చి నీ ముందర ఉంచుకొని యెరూషలేము పట్టణపు రూపమును దాని మీద వ్రాయుము .
సైన్యముల కధిపతియగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు చెట్లను నరికి యెరూషలేమునకు ఎదురుగా ముట్టడిదిబ్బ కట్టుడి, ఈ పట్టణము కేవలము అన్యాయమును అనుసరించి నడచునది గనుక శిక్ష నొందవలసి వచ్చెను.
పిమ్మట ఆయన యొక రొట్టె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాని విరిచి, వారి కిచ్చి–ఇది మీ కొరకు ఇయ్యబడుచున్న నా శరీరము ; నన్ను జ్ఞాపకము చేసికొనుటకు దీనిని చేయుడని చెప్పెను.
ఆ ప్రకారమే భోజనమైన తరువాత ఆయన గిన్నెయు పట్టుకొని–ఈ గిన్నె మీ కొరకు చిందింపబడుచున్న నా రక్తము వలన నైన క్రొత్త నిబంధన .
అందరు ఆత్మసంబంధమైన ఒకే పానీయమును పానము చేసిరి. ఏలయనగా తమ్మును వెంబడించిన ఆత్మసంబంధమైన బండలోనిది త్రాగిరి; ఆ బండ క్రీస్తే.
నేను నీ కనుగ్రహించిన నా ప్రభావముచేత నీ సౌందర్యము పరిపూర్ణము కాగా అన్యజనులు దాని చూచి నీ కీర్తి ప్రశంసించుచు వచ్చిరి; ఇదే ప్రభువగు యెహోవా వాక్కు.
ఈ కట్టడలన్నిటిని మీరు గైకొని అనుసరింపవలెను. వాటినిగూర్చి విను జనముల దృష్టికి అదే మీకు జ్ఞానము, అదే మీకు వివేకము. వారు చూచి నిశ్చయముగా ఈ గొప్ప జనము జ్ఞానవివేచనలు గల జనమని చెప్పుకొందురు.
యాకోబు సంతతిలో శేషించిన వారు యెహోవా కురిపించు మంచువలెను , మనుష్య ప్రయత్నము లేకుండను నరుల యోచన లేకుండను గడ్డి మీద పడు వర్షమువలెను ఆయా జనముల మధ్యను నుందురు .
మీరు లోకమునకు వెలుగైయున్నారు; కొండమీదనుండు పట్టణము మరుగైయుండనేరదు.