అతని పట్టుకొనుటకై నేను నా వల యొగ్గి వాని చిక్కించుకొని కల్దీయుల దేశమైన బబులోనునకు వాని తెప్పించెదను , అయితే ఆ స్థలమును చూ డకయే అతడు అక్కడ చచ్చును
అతని పట్టుకొనుటకై నేను వలనొగ్గి యతని చిక్కించుకొని బబులోనుపురమునకు అతని తీసికొనిపోయి, నామీద అతడు చేసియున్న విశ్వాస ఘాతకమునుబట్టి అక్కడనే అతనితో వ్యాజ్యెమాడుదును.
తమకాలము ఎప్పుడు వచ్చునో నరులెరుగరు; చేపలు బాధకరమైన వలయందు చిక్కుబడునట్లు, పిట్టలు వలలో పట్టుబడునట్లు, అశుభ కాలమున హఠాత్తుగా తమకు చేటు కలుగునప్పుడు వారును చిక్కుపడుదురు.
ఇదే యెహోవా వాక్కు వారిని పట్టుకొనుటకు నేను చాల మంది జాలరులను పిలిపించెదను. తరువాత ప్రతి పర్వతముమీదనుండియు ప్రతి కొండమీద నుండియు మెట్టల సందులలోనుండియు వారిని వేటాడి తోలివేయుటకై అనేకులైన వేటగాండ్రను పిలిపించెదను.
పరమునుండి ఆయన నా యెముకలమీదికి అగ్ని ప్రయోగించి యున్నాడు అది యెడతెగక వాటిని కాల్చుచున్నది నా పాదములను చిక్కు పరచుటకై వలనొగ్గి యున్నాడు నన్ను వెనుకకు త్రిప్పియున్నాడు ఆయన నన్ను పాడుచేసి దినమెల్ల నన్ను సొమ్మసిల్ల జేసియున్నాడు.
వారు వెళ్లగా నేను వారిపైని నా వల వేయుదును , ఆకాశ పక్షులను ఒకడు కొట్టినట్టు వారిని పడగొట్టుదును, వారి సమాజమునకు నేను ప్రకటించిన ప్రకారము నేను వారిని శిక్షింతును .
ఏలిక లేని చేపలతోను ప్రాకు పురుగులతోను నీవు నరులను సమానులనుగా చేసితివి .
వాడు గాలమువేసి మానవుల నందరిని గుచ్చి లాగి యున్నాడు , ఉరులు ఒగ్గి చిక్కించుకొనుచున్నాడు , వాడు తన వలతో వారిని కూర్చుకొని సంతోషపడి గంతులువేయుచున్నాడు .
కావున వలవలన మంచి భాగమును పుష్టినిచ్చు భోజనమును తనకు కలుగుచున్నవని వాడు తన వలకు బలుల నర్పించుచున్నాడు , తన ఉరులకు ధూపము వేయుచున్నాడు .
వాడు ఎల్లప్పుడును తన వలలోనుండి దిమ్మరించుచుండవలెనా ? ఎప్పటికిని మానకుండ వాడు జనములను హతము చేయు చుండవలెనా ?