నర పుత్రుడా , తూరు అధిపతితో ఈలాగు ప్రకటింపుము ప్రభువగు యెహోవా సెలవిచ్చునదేమనగా గర్విష్ఠుడవై నే నొక దేవతను , దేవతనైనట్టు సముద్రము మధ్యను నేను ఆసీనుడనై యున్నాను అని నీవనుకొను చున్నావు; నీవు దేవుడవు కాక మానవుడవై యుండియు దేవునికి తగినంత అభిప్రాయము కలిగియున్నావు , నీవు దానియేలు నకంటె జ్ఞానవంతుడవు , నీకు మర్మమైనదేదియు లేదు .
రాజు నోట ఈ మాట యుండగా ఆకాశము నుండి యొక శబ్దము వచ్చెను , ఏదనగా-రాజగు నెబుకద్నెజరూ , యిదే నీకు ప్రకటన నీ రాజ్యము నీయొద్దనుండి తొలగిపోయెను .
తమయొద్ద నుండి మనుష్యులు నిన్ను తరిమెదరు ; నీవు అడవి జంతువుల మధ్య నివాసము చేయుచు పశువులవలె గడ్డి మేసెదవు ; సర్వోన్నతుడగు దేవుడు మానవుల రాజ్యముపైన అధికారియైయుండి , తానెవనికి దాని అనుగ్రహింప నిశ్చయించునో వానికి అనుగ్రహించునని నీవు తెలిసికొను వరకు ఏడు కాలములు నీకీలాగు జరుగునని చెప్పెను.
ఎట్లనగా నీవును నీ యధిపతులును నీ రాణులును నీ ఉపపత్నులును దేవుని ఆలయసంబంధమగు ఉపకరణములలో ద్రాక్షారసము పోసి త్రాగవలెనని వాటిని తెచ్చి యుంచుకొని వాటితో త్రాగుచు , చూడ నైనను విన నైనను గ్రహింప నైనను చేతకాని వెండి బంగారు ఇత్తడి ఇనుము కఱ్ఱ రాయి అను వాటితో చేయబడిన దేవతలను స్తుతించితిరి గాని, నీ ప్రాణమును నీ సకల మార్గములును ఏ దేవుని వశమున ఉన్నవో ఆయనను నీవు ఘనపరచ లేదు .
కావున ఆయన యెదుటనుండి ఈ యరచేయి వచ్చి ఈ వ్రాతను వ్రాసెను ; వ్రాసిన శాసనమేదనగా, మెనే మెనే టెకేల్ ఉఫార్సీన్ .
ఈ వాక్య భావమేమనగా , మినే అనగా దేవుడు నీ ప్రభుత్వవిషయములో లెక్కచూచి దాని ముగించెను .
టెకేల్ అనగా ఆయన నిన్ను త్రాసులో తూచగా నీవు తక్కువగా కనబడితివి .
ఫెరేన్ అనగా నీ రాజ్యము నీయొద్దనుండి విభాగింపబడి మాదీయులకును పారసీకులకును ఇయ్యబడును .
బెల్షస్సరు ఆజ్ఞ ఇయ్యగా వారు దానియేలునకు ఊదారంగు వస్త్రము తొడిగించి యతని
మెడను బంగారపు హారమువేసి ప్రభుత్వము చేయుటలో నతడు మూడవ యధికారియని చాటించిరి .
ఆ రాత్రియందే కల్దీయుల రాజగు బెల్షస్సరు హతుడాయెను .
జనులు ఇది దైవస్వరమేకాని మానవస్వరము కాదని కేకలు వేసిరి.
అతడు దేవుని మహిమపరచనందున వెంటనే ప్రభువు దూత అతని మొత్తెను గనుక పురుగులు పడి ప్రాణము విడిచెను.
అయినను ఇతర మనుష్యులు చనిపోవునట్లు మీరును చనిపోవుదురు అధికారులలో ఒకడు కూలునట్లు మీరును కూలుదురు .
ఐగుప్తీయులు మనుష్యులేగాని దేవుడు కారు ఐగుప్తీయుల గుఱ్ఱములు మాంసమయములేగాని ఆత్మ కావు యెహోవా తన చెయ్యిచాపగా సహాయము చేయువాడు జోగును సహాయము పొందువాడు పడును వారందరు కూడి నాశనమగుదురు.