నాలుగు
యెహెజ్కేలు 14:13

నర పుత్రుడా , ఏ దేశమైతే విశ్వాసఘాతకమై నా దృష్టికి పాపముచేసినదో దానికి నేను విరోధినై ప్రాణాధారమగు ఆహారము లేకుండ జేసి కరవు పంపించి మనుష్యులను పశువులను నిర్మూలము చేయుదును

యెహెజ్కేలు 14:15

బాటసారులు సంచరింప కుండ ఆ దేశము నిర్జనమై పాడగు నట్లు నేను దానిమీదికి దుష్ట మృగములను రప్పించగా

యెహెజ్కేలు 14:17

నేను అట్టి దేశముమీదికి యుద్ధము రప్పించి ఖడ్గమును పిలిచి నీవు ఈ దేశమునందు సంచరించి మనుష్యులను పశువులను నిర్మూలము చేయుమని ఆజ్ఞ ఇచ్చిన యెడల

యెహెజ్కేలు 14:19

అట్టి దేశములోనికి తెగులు పంపి మనుష్యులును పశువులును నిర్మూలమగుటకై ప్రాణహానికరమగునంతగా నేను నా రౌద్రమును కుమ్మరించినయెడల

యెహెజ్కేలు 5:12

కరవు వచ్చి యుండగా నీలో మూడవ భాగము తెగులుచేత మరణ మవును , మూడవ భాగము ఖడ్గముచేత నీ చుట్టు కూలును , నేను కత్తి దూసిి మిగిలిన భాగమును నలు దిశల చెదరగొట్టి తరుముదును .

యెహెజ్కేలు 5:17

ఈ ప్రకారము నేను నీమీదికి క్షామమును దుష్ట మృగములను పంపుదును , అవి నీకు పుత్ర హీనత కలుగజేయును , తెగులును ప్రాణహానియు నీకు కలుగును , మరియు నీమీదికి ఖడ్గమును రప్పించెదను ; యెహోవానగు నేనే యీలాగు ఆజ్ఞ ఇచ్చుచున్నాను .

యెహెజ్కేలు 6:11

ప్రభువైన యెహోవా సెలవిచ్చునదేమనగా నీ చేతులు చరిచి నేల తన్ని ఇశ్రాయేలీయుల దుష్టమైన హేయకృత్యములనుబట్టి అయ్యో అని అంగలార్చుము ; ఖడ్గముచేతను క్షామముచేతను తెగులుచేతను వారు కూలుదురు .

యెహెజ్కేలు 6:12

దూరముననున్న వారు తెగులుచేత చత్తురు , దగ్గర నున్నవారు ఖడ్గముచేత కూలుదురు , శేషించి ముట్టడి వేయబడినవారు క్షామముచేత చత్తురు ; ఈ ప్రకారము నేను వారి మీద నా క్రోధము తీర్చుకొందును .

యెహెజ్కేలు 33:27

నా జీవముతోడు పాడైపోయిన స్థలములలో ఉండువారు ఖడ్గముచేత కూలుదురు, బయట పొలములో ఉండు వారిని నేను మృగములకు ఆహారముగా ఇచ్చెదను, కోటలలోనివారును గుహలలోనివారును తెగులుచేత చచ్చెదరు.

యిర్మీయా 15:2

మే మెక్కడికి పోదుమని వారు నిన్నడిగినయెడల నీవు వారితో నిట్లనుము. యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడుచావునకు నియమింపబడినవారు చావునకును, ఖడ్గమునకు నియమింప బడినవారు ఖడ్గమునకును, క్షామమునకు నియమింపబడినవారు క్షామమునకును, చెరకు నియమింపబడినవారు చెరకును పోవలెను.

యిర్మీయా 15:3

యెహోవా వాక్కు ఇదేచంపుటకు ఖడ్గము, చీల్చుటకు కుక్కలు, తినివేయుటకును నాశనము చేయుటకును ఆకాశపక్షులు భూమృగములు అను ఈ నాలుగు విధముల బాధలు వారికి నియమించియున్నాను.

ఆమోసు 4:6-12
6

మీ పట్టణము లన్నిటిలోను నేను మీకు దంత శుద్ధి కలుగజేసినను , మీరున్న స్థలము లన్నిటిలోను మీకు ఆహారము లేకుండ చేసినను మీరు నాతట్టు తిరిగినవారు కారు ; ఇదే యెహోవా వాక్కు .

7

మరియు కోతకాలమునకుముందు మూడు నెలలు వాన లేకుండ చేసితిని; ఒక పట్టణము మీద కురిపించి మరియొక పట్టణము మీద కురిపింపకపోతిని ; ఒక చోట వర్షము కురిసెను, వర్షము లేని చోటు ఎండిపోయెను .

8

రెండు మూడు పట్టణములవారు నీళ్లు త్రాగుటకు ఒక పట్టణమునకే పోగా అచ్చటి నీరు వారికి చాలక పోయెను ; అయినను మీరు నాతట్టు తిరిగినవారు కారు ; ఇదే యెహోవా వాక్కు .

9

మరియు మీ సస్యములను ఎండు తెగులుచేతను కాటుకచేతను నేను పాడుచేసితిని , గొంగళిపురుగు వచ్చి మీ విస్తారమైన వనములను ద్రాక్షతోటలను అంజూరపుచెట్లను ఒలీవచెట్లను తినివేసెను, అయినను మీరు నాతట్టు తిరిగిన వారు కారు ; ఇదే యెహోవా వాక్కు .

10

మరియు నేను ఐగుప్తీయుల మీదికి తెగుళ్లు పంపించినట్లు మీమీదికి తెగుళ్లు పంపించితిని ; మీ దండు పేటలో పుట్టిన దుర్గంధము మీ నాసికా రంధ్రములకు ఎక్కునంతగా మీ ¸యౌవనులను ఖడ్గముచేత హతముచేయించి మీ గుఱ్ఱములను కొల్లపెట్టించితిని ; అయినను మీరు నా తట్టు తిరిగినవారు కారు ; ఇదే యెహోవా వాక్కు .

11

దేవుడు సొదొమ గొమొఱ్ణాలను బోర్లదోసి నాశనము చేసినట్లు నేను మీలో కొందరిని నాశనముచేయగా మీరు మంటలోనుండి తీయబడిన కొరవులైనట్టు తప్పించు కొంటిరి; అయినను మీరు నా తట్టు తిరిగినవారు కారు ; ఇదే యెహోవా వాక్కు .

12

కాబట్టి ఇశ్రాయేలీయులారా , మీయెడల నేనీలాగునే చేయుదును గనుక ఇశ్రాయేలీయులారా , మీ దేవుని సన్నిధిని కనబడుటకై సిద్ధపడుడి .

ప్రకటన 6:4-8
4

అప్పుడు ఎఱ్ఱనిదైన వేరొక గుఱ్ఱము బయలువెళ్ళెను; మనుష్యులు ఒకని ఒకడు చంపుకొనునట్లు భూలోకములో సమాధానము లేకుండ చేయుటకు ఈ గుఱ్ఱముమీద కూర్చున్నవానికి అధికారమియ్యబడెను;మరియు అతనికి ఒక పెద్ద ఖడ్గమియ్యబడెను.

5

ఆయన మూడవ ముద్రను విప్పినప్పుడు రమ్ము అని మూడవ జీవి చెప్పుట వింటిని. నేను చూడగా, ఇదిగో ఒక నల్లని గుఱ్ఱము కనబడెను; దానిమీద ఒకడు త్రాసు చేతపట్టుకొని కూర్చుండి యుండెను.

6

మరియు దేనారమునకు ఒక సేరు గోధుమలనియు, దేనారమునకు మూడు సేర్ల యవలనియు, నూనెను ద్రాక్షారసమును పాడుచేయ వద్దనియు, ఆ నాలుగు జీవులమధ్య ఒక స్వరము పలికినట్టు నాకు వినబడెను.

7

ఆయన నాలుగవ ముద్రను విప్పినప్పుడు రమ్ము అని నాలుగవ జీవి చెప్పుట వింటిని.

8

అప్పుడు నేను చూడగా, ఇదిగో పాండుర వర్ణముగల ఒక గుఱ్ఱము కనబడెను; దానిమీద కూర్చున్నవాని పేరు మృత్యువు. పాతాళ లోకము వానిని వెంబడించెను. ఖడ్గమువలనను కరవువలనను మరణమువలనను భూమిలోనుండు క్రూరమృగములవలనను భూనివాసులను చంపుటకు భూమియొక్క నాలుగవ భాగముపైన అధికారము వానికియ్యబడెను.