The sea is come up upon Babylon: she is covered with the multitude of the waves thereof.
కీర్తనల గ్రంథము 18:4

మరణ పాశములు నన్ను చుట్టుకొనగను, భక్తిహీనులు వరద పొర్లువలె నామీద పడి బెదరింపగను

కీర్తనల గ్రంథము 18:16

ఉన్నతస్థలమునుండి చెయ్యి చాపి ఆయన నన్ను పట్టుకొనెను నన్ను పట్టుకొని మహా జలరాసులలోనుండి తీసెను.

కీర్తనల గ్రంథము 42:7
నీ జలప్రవాహధారల ధ్వని విని కరడు కరడును పిలుచుచున్నది నీ అలలన్నియు నీ తరంగములన్నియు నా మీదుగా పొర్లి పారియున్నవి.
కీర్తనల గ్రంథము 65:7
ఆయనే సముద్రముల ఘోషను వాటి తరంగముల ఘోషను అణచువాడు జనముల అల్లరిని చల్లార్చువాడు.
కీర్తనల గ్రంథము 93:3
వరదలు ఎలుగెత్తెను యెహోవా, వరదలు ఎలుగెత్తెను వరదలు తమ అలలను హోరెత్తునట్లు చేయుచున్నవి
యెషయా 8:7
కాగా ప్రభువు బలమైన యూఫ్రటీసునది విస్తార జలములను, అనగా అష్షూరు రాజును అతని దండంతటిని వారిమీదికి రప్పించును; అవి దాని కాలువలన్నిటిపైగా పొంగి ఒడ్డు లన్నిటిమీదను పొర్లి పారును.
యెషయా 8:8
అవి యూదా దేశములోనికి వచ్చి పొర్లి ప్రవహించును; అవి కుతికల లోతగును. ఇమ్మానుయేలూ, పక్షి తన రెక్కలు విప్పునప్పటివలె దాని రెక్కల వ్యాప కము నీ దేశ వైశాల్య మంతటను వ్యాపించును.
యెహెజ్కేలు 27:26-34
26

నీ కోలలు వేయువారు మహా సముద్రములోనికి నిన్ను త్రోయగా తూర్పు గాలి సముద్ర మధ్యమందు నిన్ను బద్దలుచేయును .

27

అప్పుడు నీ ధనమును నీ సరకులును నీవు బదులిచ్చు వస్తువులును నీ నావికులును నీ ఓడనాయకులును నీ ఓడలు బాగుచేయువారును నీతో వర్తకము చేయువారును నీలో నున్న సిపాయి లందరును నీలోనున్న జనసమూహము లన్నియు నీవు కూలు దినమందే సముద్ర మధ్యమందు కూలుదురు .

28

నీ ఓడనాయకులు వేసిన కేకలవలన నీ ఉపగ్రామములు కంపించును ;

29

కోలలు పట్టుకొను వారందరును నావికులును ఓడనాయకులును తమ ఓడల మీదనుండి దిగి తీరమున నిలిచి

30

నిన్నుగూర్చి మహా శోకమెత్తి ప్రలాపించుచు , తమ తలల మీద బుగ్గి పోసికొనుచు , బూడిదెలో పొర్లుచు

31

నీకొరకు తలలు బోడి చేసికొని మొలలకు గోనెలు కట్టుకొని మన శ్చింతగలవారై నిన్నుగూర్చి బహుగా అంగలార్చుదురు .

32

వారు నిన్నుగూర్చి ప్రలాప వచనమెత్తి తూరు పట్టణమా, నీతో సాటియైన పట్టణమేది? సముద్రము లో మునిగి లయమై పోయిన పట్టణమా, నీకు సమమైన పట్టణమేది?

33

సముద్రముమీద వచ్చిన నీ సరకులను పంపించి చాల జనములను తృప్తిపరచితివి , విస్తారమైన నీ పదార్థములచేతను నీ వర్తకముచేతను భూ పతులను ఐశ్వర్యవంతులుగా చేసితివి.

34

ఇప్పుడు అగాధ జలములలో మునిగి సముద్రబలము చేత బద్దలైతివే , నీ వర్తకమును నీ యావత్స మూహమును నీతోకూడ కూలెనే యని చెప్పుకొనుచు బహుగా ఏడ్చుదురు.

దానియేలు 9:26

ఈ అరువది రెండు వారములు జరిగిన పిమ్మట ఏమియు లేకుండ అభిషిక్తుడు నిర్మూలము చేయబడును. వచ్చునట్టి రాజు యొక్క ప్రజలు పవిత్ర పట్టణమును పరిశుద్ధ ఆలయమును నశింపజేయుదురు , వాని అంతము హఠాత్తుగా వచ్చును. మరియు యుద్ధ కాలాంతము వరకు నాశనము జరుగునని నిర్ణయింపబడెను .

లూకా 21:25

మరియు సూర్య చంద్ర నక్షత్రములలో సూచనలును , భూమి మీద సముద్ర తరంగముల ఘోషవలన కలవరపడిన జనములకు శ్రమయు కలుగును .

ప్రకటన 17:15

మరియు ఆ దూత నాతో ఈలాగు చెప్పెను -ఆ వేశ్య కూర్చున్నచోట నీవు చూచిన జలములు ప్రజలను, జనసమూహములను, జనములను, ఆ యా భాషలు మాటలాడువారిని సూచించును.

ప్రకటన 17:16

నీవు ఆ పది కొమ్ములుగల ఆ మృగమును చూచితివే, వారు ఆ వేశ్యను ద్వేషించి, దానిని దిక్కులేనిదానిగాను దిగంబరిగాను చేసి, దాని మాంసము భక్షించి అగ్నిచేత దానిని బొత్తిగా కాల్చివేతురు.