heard
యిర్మీయా 51:46

ఏటేట వదంతి పుట్టుచువచ్చును దేశములో బలాత్కారము జరుగుచున్నది ఏలికమీద ఏలిక లేచుచున్నాడు దేశములో వినబడు వదంతికి భయపడకుడి మీ హృదయములలో దిగులు పుట్టనియ్యకుడి.

యెషయా 37:7

అతనిలో ఒక ఆత్మను నేను పుట్టింతును ; వదంతి విని తన దేశమునకు వెళ్లిపోవును . అతని దేశమందు ఖడ్గముచేత అతనిని కూలజేయుదును .

యెహెజ్కేలు 7:25

సమూలధ్వంసము వచ్చేయున్నది, జనులు సమాధానము కొరకు విచారించుచున్నారు గాని అది వారికి దొరకదు.

యెహెజ్కేలు 7:26

నాశనము వెంబడి నాశనము కలుగుచున్నది, సమాచారము వెంబడి సమాచారము వచ్చుచున్నది; వారు ప్రవక్తయొద్ద దర్శనముకొరకు విచారణచేయుదురు గాని యాజకులు ధర్మశాస్త్రజ్ఞానులు కాకపోయిరి, పెద్దలు ఆలోచన చేయకయే యున్నారు.

ఓబద్యా 1:1

ఓబద్యాకు కలిగిన దర్శనము. ఎదోమును గురించి ప్రభువగు యెహోవా సెలవిచ్చునది. యెహోవాయొద్దనుండి వచ్చిన సమాచారము మాకు వినబడెను. ఎదోము మీద యుద్ధము చేయుదము లెండని జనులను రేపుటకై దూత పంపబడియున్నాడు.

మత్తయి 24:6

మరియు మీరు యుద్ధములనుగూర్చియు యుద్ధ సమాచారములను గూర్చియు వినబోదురు; మీరు కలవరపడకుండ చూచుకొనుడి. ఇవి జరుగవలసియున్నవి గాని అంతము వెంటనే రాదు.

an ambassador
యెషయా 18:2

అది సముద్రమార్గముగా జలములమీద జమ్ము పడవలలో రాయబారులను పంపుచున్నది వేగిరపడు దూతలారా, యెత్తయినవారును నునుపైన చర్మముగలవారునగు జనమునొద్దకు దూరములోనున్న భీకరజనమునొద్దకు పోవుడి. నదులు పారుచున్న దేశముగలవారును దౌష్టికులై జనములను త్రొక్కుచుండువారునగు జనము నొద్దకు పోవుడి.

యెషయా 18:3

పర్వతములమీద ఒకడు ధ్వజమెత్తునప్పుడు లోక నివాసులైన మీరు భూమిమీద కాపురముండు మీరు చూడుడి బాకా ఊదునప్పుడు ఆలకించుడి.

యెషయా 30:4

యాకోబువారి అధిపతులు సోయనులో కనబడునప్పుడు వారి రాయబారులు హానేసులో ప్రవేశించునప్పుడు

Gather
యిర్మీయా 50:9-16
9

ఉత్తరదేశమునుండి మహాజనముల సమూహమును నేను రేపుచున్నాను బబులోనునకు విరోధముగా దానిని రప్పించుచున్నాను ఆ జనులు దానిమీదికి యుద్ధపంక్తులు తీర్చుచున్నారు వారి మధ్యనుండియే ఆమె పట్టబడును ప్రజ్ఞగల బలాఢ్యులు దోపుడుసొమ్ము పట్టుకొనక మరలని రీతిగా వారి బాణములు అమోఘములై తిరిగి రాకుండును.

10

కల్దీయుల దేశము దోపుడుసొమ్మగును దాని దోచుకొను వారందరు సంతుష్టి నొందెదరు ఇదే యెహోవా వాక్కు.

11

నా స్వాస్థ్యమును దోచుకొనువారలారా, సంతోషించుచు ఉత్సహించుచు నురిపిడిచేయుచు పెయ్యవలె గంతులువేయుచు బలమైన గుఱ్ఱములవలె మీరు సకిలించుచున్నారే?

12

మీ తల్లి బహుగా సిగ్గుపడును మిమ్మును కన్నది తెల్లబోవును ఇదిగో అది జనములన్నిటిలో అతినీచ జనమగును అది యెడారియు ఎండినభూమియు అడవియునగును.

13

యెహోవా రౌద్రమునుబట్టి అది నిర్జనమగును అది కేవలము పాడైపోవును బబులోను మార్గమున పోవువారందరు ఆశ్చర్యపడి దాని తెగుళ్లన్నియు చూచి--ఆహా నీకీగతి పట్టినదా? అందురు

14

ఆమె యెహోవాకు విరోధముగా పాపముచేసినది. విల్లు త్రొక్కువారలారా, మీరందరు బబులోనునకు విరోధముగా దాని చుట్టు యుద్ధపంక్తులు తీర్చుడి ఎడతెగక దానిమీద బాణములు వేయుడి

15

చుట్టు కూడి దానిని బట్టి కేకలువేయుడి అది లోబడ నొప్పుకొనుచున్నది దాని బురుజులు పడిపోవుచున్నవి దాని ప్రాకారములు విరుగగొట్టబడుచున్నవి ఇది యెహోవా చేయు ప్రతికారము.దానిమీద పగతీర్చుకొనుడి అది చేసినట్టే దానికి చేయుడి.

16

బబులోనులో నుండకుండ విత్తువారిని నిర్మూలము చేయుడి కోతకాలమున కొడవలి పట్టుకొనువారిని నిర్మూలము చేయుడి క్రూరమైన ఖడ్గమునకు భయపడి వారందరు తమ ప్రజలయొద్దకు వెళ్లుచున్నారు తమ తమ దేశములకు పారిపోవుచున్నారు.

యిర్మీయా 51:11

బాణములు చికిలిచేయుడి కేడెములు పట్టుకొనుడి బబులోనును నశింపజేయుటకు యెహోవా ఆలోచించుచున్నాడు మాదీయుల రాజుల మనస్సును దానిమీదికి రేపుచున్నాడు. అది యెహోవా చేయు ప్రతిదండన తన మందిరమునుగూర్చి ఆయన చేయు ప్రతిదండన.

యిర్మీయా 51:27

దేశములో ధ్వజములనెత్తుడి జనములలో బాకానాదము చేయుడి దానిమీదికి పోవుటకై జనములను ప్రతిష్ఠించుడి దానిమీద పడుటకై అరారాతు మిన్నీ అష్కనజు అను రాజ్యములను పిలిపించుడి దానిమీదికి జనులను నడిపించుటకై సేనాధిపతినినియ మించుడి రోమముగల గొంగళిపురుగులంత విస్తారముగా గుఱ్ఱములను దానిమీదికి రప్పించుడి.

యిర్మీయా 51:28

దానిమీదికిపోవుటకై మాదీయుల రాజులను వారి అధిపతులను వారి యేలికలను అతడు ఏలుచుండు సర్వదేశమును జనులనందరిని ప్రతిష్ఠించుడి

యెషయా 13:2

జనులు ప్రధానుల ద్వారములలో ప్రవేశించుటకు చెట్లులేని కొండమీద ధ్వజము నిలువబెట్టుడి ఎలుగెత్తి వారిని పిలువుడి సంజ్ఞ చేయుడి.

యెషయా 13:3

నాకు ప్రతిష్ఠితులైనవారికి నేను ఆజ్ఞ ఇచ్చియున్నాను నా కోపము తీర్చుకొనవలెనని నా పరాక్రమశాలురను పిలిపించియున్నాను నా ప్రభావమునుబట్టి హర్షించువారిని పిలిపించియున్నాను.