అవి పలుకవు
కీర్తనల గ్రంథము 115:5-8
5

వాటికి నోరుండియు పలుకవు కన్నులుండియు చూడవు

6

చెవులుండియు వినవు ముక్కులుండియు వాసనచూడవు

7

చేతులుండియు ముట్టుకొనవు పాదములుండియు నడువవు గొంతుకతో మాటలాడవు .

8

వాటిని చేయువారును వాటియందు నమి్మకయుంచు వారందరును వాటివంటివారైయున్నారు .

కీర్తనల గ్రంథము 135:16-18
16

వాటికి నోరుండియు పలుకవు కన్నులుండియు చూడవు

17

చెవులుండియు వినవు వాటి నోళ్లలో ఊపిరి లేశమైన లేదు.

18

వాటినిచేయువారును వాటియందు నమి్మకయుంచు వారందరును వాటితో సమానులగుదురు.

హబక్కూకు 2:19

కఱ్ఱనుచూచి మేలుకొమ్మనియు , మూగ రాతిని చూచి లెమ్మనియు చెప్పువానికి శ్రమ ; అది ఏమైన బోధింపగలదా ? అది బంగారముతోను వెండితోను పూతపూయబడెను గాని దానిలో శ్వాసమెంత మాత్రమును లేదు .

1 కొరింథీయులకు 12:2

మీరు అన్యజనులై యున్నప్పుడు మూగ విగ్రహములను ఆరాధించుటకు ఎటుపడిన అటు నడిపింపబడితిరని మీకు తెలియును.

ప్రకటన 13:14

కత్తి దెబ్బ తినియు బ్రదికిన యీ క్రూరమృగమునకు ప్రతిమను చేయవలెనని అది భూనివాసులతో చెప్పుచు, ఆ మృగము ఎదుట చేయుటకు తనకియ్యబడిన సూచనలవలన భూనివాసులను మోసపుచ్చుచున్నది.

ప్రకటన 13:15

మరియు ఆ మృగముయొక్క ప్రతిమ మాటలాడునట్లును, ఆ మృగము యొక్క ప్రతిమకు నమస్కారముచేయని వారిని హతము చేయునట్లును, ఆ మృగముయొక్క ప్రతిమకు ప్రాణమిచ్చుటకై దానికి అధికారము ఇయ్యబడెను.

వాటిని మోయవలసివచ్చెను
యెషయా 46:1

బేలు కూలుచున్నది నెబో క్రుంగుచున్నది వాటి ప్రతిమలు జంతువులమీదను పశువులమీదను మోయబడుచున్నవి

యెషయా 46:7

వారు భుజముమీద దాని నెక్కించుకొందురు దాని మోసికొనిపోయి తగినచోట నిలువబెట్టుదురు ఆ చోటు విడువకుండ అది అక్కడనే నిలుచును ఒకడు దానికి మొఱ్ఱపెట్టినను ఉత్తరము చెప్పదు వాని శ్రమ పోగొట్టి యెవనిని రక్షింపదు .

అవి హానిచేయ నేరవు
యెషయా 41:23

ఇకమీదట రాబోవు సంగతులను తెలియజెప్పుడి అప్పుడు మీరు దేవతలని మేము ఒప్పుకొందుము మేము ఒకరినొకరము సాటిచేసికొని కనుగొనునట్లు మేలైనను కీడైనను చేయుడి.

యెషయా 41:24

మీరు మాయాసంతానము మీ కార్యము శూన్యము మిమ్మును కోరుకొనువారు హేయులు .

యెషయా 44:9

విగ్రహమును నిర్మించు వారందరు మాయవంటివారు వారికిష్టమైన విగ్రహములు నిష్‌ ప్రయోజనములు తామే అందుకు సాక్షులు , వారు గ్రహించువారు కారు ఎరుగువారు కారు గనుక వారు సిగ్గుపడరు .

యెషయా 44:10

ఎందుకును పనికి రాని విగ్రహమును పోతపోసి దాని నొక దేవునిగా నిరూపించు వాడెవడు ?

యెషయా 45:20

కూడి రండి జనములలో తప్పించుకొనినవారలారా, దగ్గరకు వచ్చి కూడుకొనుడి తమ కొయ్యవిగ్రహమును మోయుచు రక్షింపలేని దేవతకు మొఱ్ఱపెట్టువారికి తెలివిలేదు.

1 కొరింథీయులకు 8:4

కాబట్టి విగ్రహములకు బలిగా అర్పించినవాటిని తినుట విషయము : –లోకమందు విగ్రహము వట్టిదనియు, ఒక్కడే దేవుడు తప్ప వేరొక దేవుడు లేడనియు ఎరుగుదుము.