యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు మీరు ఊరకయే అమ్మబడితిరి గదా రూకలియ్యకయే మీరు విమోచింపబడెదరు.
యెషయా 45:13

నీతినిబట్టి కోరెషును రేపితిని అతని మార్గము లన్నియు సరాళముచేసెదను అతడు నా పట్టణమును కట్టించును క్రయధనము తీసికొనకయు లంచము పుచ్చు కొనకయు నేను వెలివేసినవారిని అతడు విడిపించును

యెషయా 50:1

యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు నేను మీ తల్లిని విడనాడిన పరిత్యాగ పత్రిక ఎక్కడనున్నది? నా అప్పులవారిలో ఎవనికి మిమ్మును అమ్మివేసితిని ? మీ దోషములనుబట్టి మీరు అమ్మబడితిరి మీ అతిక్రమములనుబట్టి మీ తల్లి పరిత్యాగము చేయబడెను.

కీర్తనల గ్రంథము 44:12

అధికమైన వెల చెప్పక ధనప్రాప్తిలేకయే నీవే నీ ప్రజలను అమ్మియున్నావు

యిర్మీయా 15:13

నా జనులారా మీ ప్రాంతములన్నిటిలో మీరు చేయు సమస్త పాపములను బట్టి మీ స్వాస్థ్యమును నిధులను క్రయములేకుండ నేను దోపుడు సొమ్ముగా అప్పగించుచున్నాను.

1 పేతురు 1:18

పితృపారంపర్యమైన మీ వ్యర్థప్రవర్తనను విడిచిపెట్టునట్లుగా వెండి బంగారములవంటి క్షయ వస్తువులచేత మీరు విమోచింపబడలేదుగాని

రోమీయులకు 7:14-25
14

ధర్మశాస్త్రము ఆత్మ సంబంధమైనదని యెరుగుదుము ; అయితే నేను పాపము నకు అమ్మబడి శరీరసంబంధినై యున్నాను .

15

ఏలయనగా నేను చేయునది నేనెరుగను ; నేను చేయ నిచ్ఛయించు నది చేయక ద్వేషించు నదియే చేయుచున్నాను .

16

ఇచ్ఛ యింపనిది నేను చేసిన యెడల ధర్మశాస్త్రము శ్రేష్ఠమైనదై నట్టు ఒప్పుకొనుచున్నాను .

17

కావున ఇకను దాని చేయునది నా యందు నివసించు పాపమే గాని నేను కాదు .

18

నా యందు , అనగా నా శరీర మందు మంచిది ఏదియు నివసింపదని నేనెరుగుదును . మేలైనది చేయవలెనను కోరిక నాకు కలుగుచున్నది గాని , దానిని చేయుట నాకు కలుగుట లేదు .

19

నేను చేయగోరు మేలు చేయక చేయగోరని కీడు చేయుచున్నాను .

20

నేను కోరని దానిని చేసిన యెడల , దానిని చేయునది నా యందు నివసించు పాపమే గాని యికను నేను కాదు .

21

కాబట్టి మేలు చేయ గోరు నాకు కీడు చేయుట కలుగుచున్నదను ఒక నియమము నాకు కనబడుచున్నది .

22

అంతరంగ పురుషుని బట్టి దేవుని ధర్మశాస్త్రము నందు నేను ఆనందించుచున్నాను గాని

23

వేరొక నియమము నా అవయవము లలో ఉన్నట్టు నాకు కనబడుచున్నది . అది నా మనస్సు నందున్న ధర్మశాస్త్రముతో పోరాడుచు నా అవయవము లలో నున్న పాప నియమమునకు నన్ను చెరపట్టి లోబరచుకొనుచున్నది.

24

అయ్యో, నేనెంత దౌర్భాగ్యుడను ? ఇట్టి మరణమునకు లోనగు శరీరము నుండి నన్నెవడు విడిపించును ?

25

మన ప్రభువైన యేసు క్రీస్తు ద్వారా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. కాగా మనస్సు విషయములో నేను దైవ నియమమునకును , శరీర విషయములో పాప నియమమునకును దాసుడనై యున్నాను.