జ్ఞానులు
యోబు గ్రంథము 11:12

అయితే అడవి గాడిదపిల్ల నరుడై పుట్టిననాటికి గాని బుద్ధిహీనుడు వివేకికాడు.

సామెతలు 3:7

నేను జ్ఞానిని గదా అని నీవనుకొనవద్దు యెహోవాయందు భయభక్తులుగలిగి చెడుతనము విడిచిపెట్టుము

సామెతలు 26:12

తన దృష్టికి జ్ఞానిననుకొనువానిని చూచితివా? వానిని గుణపరచుటకంటె మూర్ఖుని గుణపరచుట సుళువు.

సామెతలు 26:16

హేతువులు చూపగల యేడుగురికంటె సోమరి తన దృష్టికి తానే జ్ఞానిననుకొనును

యోహాను 9:41

అందుకు యేసు మీరు గ్రుడ్డివారైతే మీకు పాపము లేక పోవును గాని చూచుచున్నామని మీరిప్పుడు చెప్పుకొనుచున్నారు గనుక మీ పాపము నిలిచియున్నదని చెప్పెను.

రోమీయులకు 1:22

వారి అవివేక హృదయము అంధకారమయమాయెను ; తాము జ్ఞానులమని చెప్పుకొనుచు బుద్ధిహీనులైరి .

రోమీయులకు 11:25
సహోదరులారా , మీదృష్టికి మీరే బుద్ధిమంతులమని అనుకొనకుండునట్లు ఈ మర్మము మీరు తెలిసికొన గోరుచున్నాను . అదేమనగా , అన్యజనుల ప్రవేశము సంపూర్ణ మగువరకు ఇశ్రాయేలునకు కఠిన మనస్సు కొంతమట్టుకు కలిగెను .
రోమీయులకు 12:16

ఏడ్చు వారితో ఏడువుడి ; ఒకనితో నొకడు మనస్సుకలిసి యుండుడి. హెచ్చు వాటియందు మనస్సుంచక తగ్గువాటియందు ఆసక్తులై యుండుడి. మీకు మీరే బుద్ధిమంతులమని అనుకొనవద్దు .

1 కొరింథీయులకు 3:18-20
18

ఎవడును తన్నుతాను మోసపరచుకొనకూడదు. మీలో ఎవడైనను ఈ లోకమందు తాను జ్ఞానినని అనుకొనిన యెడల, జ్ఞానిఅగునట్టు వెఱ్ఱివాడుకావలెను.

19

ఈ లోక జ్ఞానము దేవుని దృష్టికి వెఱ్ఱితనమే.జ్ఞానులను వారి కుయుక్తిలో ఆయన పట్టుకొనును;

20

మరియు జ్ఞానుల యోచనలు వ్యర్థములని ప్రభువునకు తెలియును అని వ్రాయబడియున్నది.